BigTV English

OTT Movie : ఆడదాన్నే చూడని వాడితో దేవదాసీ కూతురు అరాచకం… ఈ మలయాళ బో*ల్డ్ మూవీ క్లైమాక్స్ ట్విస్ట్ కు దిమాక్ కరాబ్

OTT Movie : ఆడదాన్నే చూడని వాడితో దేవదాసీ కూతురు అరాచకం… ఈ మలయాళ బో*ల్డ్ మూవీ క్లైమాక్స్ ట్విస్ట్ కు దిమాక్ కరాబ్

OTT Movie : ఓటీటీల వాడకం పెరిగిన తరువాత బో*ల్డ్ సినిమాలకంటూ సెపరేట్ గా ఫ్యాన్ బేస్ పెరిగింది. ఇలాంటి సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నా ఏమాత్రం మోహమాటపడకుండా చూసేస్తున్నారు మూవీ లవర్స్. అయితే ఇందులోనూ హారర్ రొమాంటిక్, ఫీల్ గుడ్ వంటి జానర్లలో లెక్కలేనన్ని బో*ల్డ్ మూవీస్ ఉన్నాయి. కానీ మైథలాజికల్ టచ్ తో ఉండే రొమాంటిక్ అండ్ ‘బో*ల్డ్ సినిమాలు చాలా అరుదు. అందులోనూ ఈ కాంబినేషన్లో రూపొంది, కల్ట్ ఫాలోయింగ్ తో అవార్డులను సైతం అందుకున్న సినిమాను మీరెప్పుడైనా చూశారా? అలాంటి మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? అనే వివరాల్లోకి వెళ్తే…


బో*ల్డ్ మూవీకి కల్ట్ ఫాలోయింగ్, అవార్డుల పంట
ఇప్పుడు మనం చెప్పుకుంటన్నది ‘వైశాలి’ (Vaishali) అనే మలయాళ సినిమా గురించి. 1988లో రిలీజ్ అయిన ఈ మూవీ మహాభారతంలోని ఒక ఉపకథ ఆధారంగా తెరకెక్కింది. దీనికి భరతన్ దర్శకత్వం వహించగా, అంగ రాజ్యంలోని కరువు నేపథ్యంలో, వైశాలి అనే దేవదాసి యువతి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాకు ఎం.టి. వాసుదేవన్ నాయర్ స్క్రిప్ట్‌ అందివ్వగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలు మధు అంబట్ నిర్వర్తించారు. ‘వైశాలి’ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి, కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. అంతేకాదు సినిమాటోగ్రఫీ, దర్శకత్వం, రచనకు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో సుపర్ణ ఆనంద్ (Suvarna Anand) వైశాలిగా, సంజయ్ మిత్ర (Sanjay Mitra) ఋష్యశృంగన్‌గా అద్భుతంగా నటించారు. గీత, నెడుముడి వేణు, బాబు ఆంటోనీ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో స్త్రీల త్యాగం, రాజకీయ కుట్రలు, సమాజంలో అణగారిన వర్గాల దుస్థితిని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.

కథ
అంగ రాజ్యానికి రాజు లోమపాదన్ (బాబు ఆంటోనీ). ఒక బ్రాహ్మణుడి శాపం కారణంగా ఈ రాజ్యం 12 సంవత్సరాలుగా తీవ్రమైన కరువుతో బాధపడుతోంది. ఈ శాపం నుండి విముక్తి పొందడానికి రాజగురువు (నెడుముడి వేణు) సూచన మేరకు… విభాందక మహర్షి (వి.కె. శ్రీరామన్) కుమారుడు ఋష్యశృంగన్ (సంజయ్ మిత్ర) చేత ఒక మహాయాగం జరపాలని రాజు నిర్ణయిస్తాడు. కానీ ఋష్యశృంగన్ అడవిలో తన తండ్రితో ఏకాంతంగా జీవిస్తూ, అమ్మాయి అంటే ఏంటో కనీసం అవగాహన లేకుండా బతుకుతుంటాడు.


Read Also : స్కూల్ కు తిరిగొచ్చిన రాకాసి పిల్ల… ఇక దబిడి దిబిడే… ‘వెడ్నెస్‌ డే’ సీజన్ 2 స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

దీంతో రాజ వేశ్య మాలిని కుమార్తె వైశాలిని (సుపర్ణ ఆనంద్) ఋష్యశృంగన్‌కు ఎలాగైనా వలపు వల వేసి, అతన్ని చంపాపురి రాజధానికి తీసుకురావాలని రాజు ఆదేశిస్తాడు. కానీ మాలిని రాజు దగ్గర ఓ మాట తీసుకుని తన కూతురిని పంపిస్తుంది. అసలు పుట్టి బుద్దెరిగినప్పటి నుంచి అమ్మాయిలనే చూడని ఋష్యశృంగన్‌ను వైశాలి ఎలా పడేసింది? మాలిని తన కూతురు కోసం రాజు దగ్గర తీసుకున్న మాట ఏంటి? ఇచ్చిన మాటను రాజు నిలబెట్టుకున్నాడా లేదా ? ఆ శాపం నుంచి రాజ్యానికి విముక్తి దొరికిందా? చివరకు ఏం జరిగింది ? ఈ మూవీకి కల్ట్ ఫాలోయింగ్ ఎందుకు దక్కింది? అనేది తెలియాలంటే ‘వైశాలి’ మూవీని యూట్యూబ్ లో ఫ్రీగానే చూడొచ్చు.

Tags

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×