BigTV English

Drunken Shrimp: రొయ్యలకు బాగా మద్యం తాగించి.. మలమల మరిగే నూనెలో వేసి.. ఇది ఎక్కడ దొరుకుతుందంటే?

Drunken Shrimp: రొయ్యలకు బాగా మద్యం తాగించి.. మలమల మరిగే నూనెలో వేసి.. ఇది ఎక్కడ దొరుకుతుందంటే?

BIG TV LIVE Originals: ప్రపంచ వ్యాప్తంగా బోలెడు ఆహారపు అలవాట్లు ఉన్నాయి. కొన్ని దేశాల్లో మరింత చిత్ర విచిత్రమైన డిషెస్ కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఓ వెరైటీ వంటకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని పేరు ‘డ్రంకెన్ ష్రింప్’. ఇది చైనా సహా, పలు ఆసియా దేశాల్లో కనిపిస్తుంది. చైనీస్ వంటకాల్లో విచిత్రమైనది. ‘డ్రంకెన్ ష్రింప్’ డిష్ కోసం సాధారణంగా మంచినీటి రొయ్యలను ఉపయోగిస్తారు. వీటిని సాధారణంగా పచ్చిగా లేదంటే ఉడికించి తింటారు.


మద్యం తాగించి.. నూనెలో వేయించి..

‘డ్రంకెన్ ష్రింప్’ వంటకం తయారీ క్రేజీగా ఉంటుంది. ముందుగా బతికి ఉన్న రొయ్యలను పాత్రలో తీసుకుంటారు. ఆ పాత్రలో మద్యం పోస్తారు. రొయ్యలు మద్యం తాగేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ పాత్రలో రైస్ వైన్ లేదంటే బైజియం పోస్తారు. కడుపునిండా మద్యం తాగగానే, వాటిని తీసుకెళ్లి మసిలే నూనెలో వేసి బాగా వేయించుతారు. ఆ తర్వాత రొయ్యలకు సంబంధించి పొట్టును తీసేస్తారు. వేడి వేడిగా ఉన్న వంటకాన్ని అందిస్తారు. వేడి మీద అలాగే తింటే ఆహా అనాల్సిందే.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ఇక ‘డ్రంకెన్ ష్రింప్’ వంటకానికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూడ్డానికి ఇదో చైనీస్ రెస్టారెంట్ లా కనిపిస్తోంది. ఈ వీడియోలో ఓ పాత్రలో కొన్ని ప్రాణంతో ఉన్న రొయ్యలను తీసుకున్నారు. వాటి మీద పైగా గోపురం లాంటి గాజు పాత్రపో బోర్లించారు. వాటిని ఓ టేబుల్ మీద ఉంచి నెమ్మదిగా మద్యాన్ని పోశారు.  అవన్నీ మద్యంలో మునిగేలా చేస్తారు. కాసేపటి తర్వాత రొయ్యలు కడుపునిండా మద్యం తాగుతాయి. వాటిని  నెమ్మదిగా తీసుకెళ్లి కడాయి పెట్టి, నూనెపోసి చక్కగా మరిగిస్తారు. దోరగా వేగిన తర్వాత వాటిని పాత్రలోకి తీసుకుని, వడ్డిస్తారు.

ఈ వంటకం ఏ దేశాల్లో ఉంటుందంటే?

‘డ్రంకెన్ ష్రింప్’ వంటకం ఎక్కువగా చైనాలో ఫేమస్. తూర్పు ఆసియా దేశంలోని ఓ రెస్టారెంట్ లాగా కనిపిస్తుంది. డ్రంకెన్ రొయ్యలకు సంబంధించిన ఫుడ్, చైనాలోని కొన్ని ప్రాంతాలలో సాంప్రదాయ వంటకంగా కొనసాగుతోంది. జపాన్ లాంటి ఇతర తూర్పు ఆసియా వంటకాలలో లైవ్ సీఫుడ్‌ ను ఇలాంటి పద్దతుల ద్వారా తయారు చేసి వడ్డిస్తారు.

నెటిజన్లు ఏం అంటున్నారంటే?  

ఈ వంటకాన్ని తయారు చేసే విధానాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అదే సమయంలో బతికి ఉన్న రొయ్యలను అత్యంత దారుణంగా మరిగే నూనెలో వేయడాన్ని తప్పుబడుతున్నారు. ఆహారంలో రొయ్యలను ఉపయోగించడం తప్పుకాదు. కానీ, ఇలాంటి పద్దతి మంచిది కాదని కామెంట్స్ పెడుతున్నారు. ఇది నిజంగా క్రూరమైన విధానం అంటున్నారు. జీవ హింసకు ఇలాంటి వంటకాలు ప్రత్యక్ష ఉదాహారణ అని మరికొంత మంది ఆవేదన వ్యక్తం చేశారు. బతికి ఉన్న వాటిని ఘోరంగా నూనెలో వేయించడం దారుణం ఉందంటున్నారు. మరికొంత మంది వంటకాలను వంటకాల్లాగే చూడాలి అని మద్దతు పలుకుతున్నారు.  మొత్తంగా ఈ వెరైటీ వంటకం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.

Read Also: పహల్ గామ్ లో ఉగ్రదాడి, పాక్ ఎంబసీలో కేక్ కటింగ్.. వీడియో వైరల్!

 

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×