20 Lakhs Reward: కశ్మీర్, అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల హింసాత్మక దాడితో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటన వార్త విన్న దేశ ప్రజలు షాక్ కు గురయ్యారు. అమాయక టూరిస్టులపై విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 27 మంది మృతి చెందడం దేశ ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇప్పటికే రక్షణ దళాలు, కశ్మీర్ పోలీసులు, పారా మిలిటరీ దళాలు రంగంలోకి దిగి ఉగ్రవాదుల కదలికలపై పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. దేశ ప్రజలు ఉగ్రవాదులపై ఫైరవుతున్నారు. వారిని ఎక్కడున్నా దొరకపట్టి కఠినంగా శిక్షంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వారికి ఆచూకీ తెలిపితే రూ.20లక్షల నగదు బహుమతి
ఈ ఉగ్రవాద చర్యలపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రతీకారం తీర్చుకోవాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఉగ్రవాదుల ఎరివేతకు ఇప్పటికే మోదీ సర్కార్ రెడీ అయ్యింది. ఉగ్రవాదులను ఎలాంటి పరిస్థితుల్లో అయినా అదుపులోకి తీసుకుంటామని.. ఇందుకోసం స్థానిక పౌరులు కూడా సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కశ్మీర్ లోని అనంతనాగ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పహల్గామ్ దాడి తర్వాత భయపడి పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదుల పట్టించిన వారికి లేదా వారి ఆచూకీ తెలిపిన వారికి రూ. 20 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.
Also Read: Kashmir terrorist attack: పాపం ఈ కుటుంబ పరిస్థితి.. భార్య, కొడుకు ముందే దారుణంగా కాల్చి చంపారు..
ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలి..
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని శిక్షేందుకు ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ ఉగ్రవాదుల దాడిలో కొంతమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతిని వ్యక్తం చేయగా.. ఉగ్రవాదంపైన ఇకపై కఠినంగా వ్యవహరించాలని ప్రపంచ దేశాల నుంచి ముక్తకంఠంతో ఈ ఘటనను ఖండిస్తూ సందేశాలు ఇస్తున్నాయి.
ప్రధాని అత్యవసర కేబినెట్ సెక్యూరిటీ సమావేశం..
ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యవసర కేబినెట్ సెక్యూరిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. తదుపరి చర్యలపై ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ కేబినెట్ సమావేశంలో దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. కశ్మీర్ లో నెలకొన్న భద్రతా పరిస్థితులపై సమావేశంలో చర్చించారు.
Also Read: BREAKING: కశ్మీర్ ఉగ్రదాడి.. భారత్ సంచలన నిర్ణయం..