Wednesday Season 2 Teaser : దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) తాజాగా మోస్ట్ అవైటింగ్ సిరీస్ అప్డేట్ తో తమ సబ్ స్క్రైబర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పాపులర్ హారర్-ఫాంటసీ థ్రిల్లర్ సిరీస్‌లలో ఒకటైన ‘వెడ్నెస్ డే’ సీజన్ 2 (Wednesday Season 2) టీజర్ ను రిలీజ్ చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సిరీస్ రిలీజ్ డేట్ ను కూడా టీజర్ ద్వారా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. అలాగే ఈసారి కొత్త సీజన్ మరింత ఉత్కంఠభరితంగా, ఇంట్రెస్టింగ్ గా, హారర్ అంశాలతో నిండి ఉంటుందని టీజర్ ద్వారా వెల్లడించారు. ఈ సిరీస్ టీజర్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.
‘వెడ్నెస్ డే’ సీజన్ 2కు సెంటిమెంట్
ఈ సిరీస్ విషయంలో మేకర్స్ టైటిల్ కు తగ్గట్టుగానే వెడ్నెస్ డే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. అందుకే బుధవారమే ‘వెడ్నెస్ డే’ సీజన్ 2 టీజర్ ను రిలీజ్ చేసి ట్రీట్ ఇచ్చింది నెట్ ఫ్లిక్స్. ఈ సిరీస్‌లో జెన్నా ఒర్టెగా వెడ్నెస్‌డే ఆడమ్స్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రిలీజ్ అయిన ‘వెడ్నెస్ డే’ సీజన్ 2 టీజర్ ట్రైలర్ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తించింది. నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన ఈ టీజర్ లో వెడ్నెస్ డే ఆడమ్స్ చుట్టూ తిరిగే ఈ కథ మరింత మిస్టరీ, డార్క్ హ్యూమర్, థ్రిల్లింగ్ అంశాలతో ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. నెవర్‌మోర్ అకాడమీలో కొత్త సాహసాలు, ఇంటెన్స్ స్టోరీ, కొత్త పాత్రలు వంటి అంశాలు ఈ సిరీస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మరి ఈ రాకాసి పిల్ల ఈ సీజన్లో ఏం చేస్తుందో చూడాల్సిందే.
సీజన్ 2 స్ట్రీమింగ్ రెండు భాగాలుగా…
ఈ సిరీస్ రెండవ సీజన్ రెండు భాగాలుగా విడుదల అవుతుంది. టీజర్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సమాచారం ప్రకారం ‘వెడ్నెస్ డే’ సీజన్ 2 మొత్తం 7 ఎపిసోడ్ లుగా రాబోతోంది. అయితే ఫస్ట్ పార్ట్ లో నాలుగు ఎపిసోడ్ లు మాత్రమే ఉంటాయి. అవి ఆగస్టు 6న రిలీజ్ అవుతాయి. రెండవ భాగం అంటే మిగిలిన 3 ఎపిసోడ్‌లు సెప్టెంబర్ 3న ప్రీమియర్ అవుతాయి. ఈ సిరీస్ మొదటి సీజన్ కు మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలోనే మూవీ లవర్స్ ఈ సిరీస్ స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also : ఓటీటీలోకి ‘మ్యాడ్ స్క్వేర్’.. ధూమ్ ధామ్ ట్రైలర్ వదిలిన నెట్ ఫ్లిక్స్, స్ట్రీమింగ్ అప్పుడే!
కాగా ‘వెడ్నెస్ డే’ సీజన్ 2లో జెన్నా ఒర్టెగా, ఎమ్మా మైయర్స్, లూయిస్ గుజ్మాన్, బిల్లీ పైపర్, స్టీవ్ బుస్సేమి, కేథరీన్ జీటా-జోన్స్ తదితరులు నటించారు. టిమ్ బర్టన్ నాలుగు ఎపిసోడ్‌లకు దర్శకత్వం వహించారు. మిగిలిన ఎపిసోడ్ లు పాకో కాబెజాస్, ఏంజెలా రాబిన్సన్ దర్శకత్వంలో రూపొందాయి.