E-Paper
Advertisement

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్…  ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా
Advertisement

Crime Thriller on OTT : ఒక అపార్ట్‌మెంట్‌ లో చిన్నారి ఒక్కసారిగా కనిపించకుండా పోతే ? అదే భవనంలో ఓ వ్యక్తి తండ్రి శవాన్ని దాచిపెడితే ? మరోవైపు ఒంటరిగా ఉంటున్న మహిళపై దాడి జరిగితే ? చూస్తే ఈ మూడు ఘటనలకు ఒకదానితో మరొకదానికి ఎలాంటి సంబంధం లేదనిపిస్తుంది. కానీ ఒక్కో నిజం బయటకు వస్తున్న కొద్దీ… ఇవన్నీ ఒకే చోట, ఒకే మిస్టరీ చుట్టూ తిరుగుతున్నాయని తెలిస్తే ? ఇదే కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను మైండ్ గేమ్‌లోకి తీసుకెళ్లే చైనీస్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ Vanishing Point. మరి ఆ మూడు కథలు ఎలా కలిశాయి ? అసలు ఆ అపార్ట్‌మెంట్‌ లో ఏం జరుగుతోంది ? తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఓ చలికాలపు ఉదయం… టాంగ్ యు తన చిన్న కొడుకును తీసుకుని అపార్ట్‌మెంట్ మెట్ల దగ్గరికి వస్తాడు. కానీ కాసేపటికే బాబు కనిపించకుండా పోతాడు. కళ్ల ముందే జరిగిన ఈ మిస్సింగ్ ఘటనతో టాంగ్ యు షాక్‌ కు గురవుతాడు. కొడుకు కోసం అతను చేసే ప్రయత్నాల్లో… అపార్ట్‌మెంట్‌ లోని కొందరు వ్యక్తుల ప్రవర్తన అనుమానాలను రేకెత్తిస్తుంది. బాబు నిజంగా ఎక్కడికి వెళ్లాడు ? ఎవరైనా కావాలనే తీసుకెళ్లారా ? అనే ప్రశ్నలు మొదలవుతాయి.

Advertisement

ఇదే సమయంలో అదే భవనంలో యువకుడు యువాన్ వూ మరో సమస్యలో చిక్కుకుంటాడు. అతనికి జూదం అలవాటు. అప్పులు పెరిగిపోతుంటాయి. డబ్బుల విషయంలో తండ్రితో జరిగిన గొడవలో ఆయనకు గుండెపోటు వచ్చి చనిపోతాడు. కానీ తండ్రి మరణాన్ని బయటకు చెప్పకుండా.. ఆయనకు వచ్చే పింఛన్ డబ్బుల కోసం శవాన్ని ఇంట్లోనే దాచిపెడతాడు. శవం బయటపడితే తన రహస్యం మొత్తం బయటపడుతుందని భయపడుతూ అతను చేసే పనులు మరింత ప్రమాదకరంగా మారతాయి.

మరోవైపు అదే అపార్ట్‌మెంట్‌ లో ఒంటరిగా జీవించే లిన్ చుపింగ్‌ పై ఓ అపరిచితుడు దాడి చేస్తాడు. ఆ ఘటన వెనుక అసలు కారణమేంటి ? దాడి చేసిన వ్యక్తి ఎవరు ? ఈ మూడు ఘటనలకు మధ్య ఏదైనా సంబంధం ఉందా ? అనే అనుమానాలు కథ ముందుకు వెళ్లే కొద్దీ మరింత బలపడతాయి. చివరికి విడివిడిగా కనిపించిన ఈ క్రైమ్స్ ఒకే మిస్టరీలో భాగమని అర్థమవుతుంది. ఎవరు నిజం చెబుతున్నారు ? ఎవరు ఏం దాస్తున్నారు ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే.

Advertisement

Also Read : వింత వింత జంతువులతో క్రేజీ అడ్వెంచర్… తెలుగులోనే ఈ కిడ్స్ అండ్ ఫ్యామిలీ ధమాకా

తెలుగులో చూడొచ్చా ?

‘వానిషింగ్ పాయింట్’ చైనీస్ భాషలో తెరకెక్కిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. ప్రముఖ దర్శకుడు చెంగ్ వీ-హావో దర్శకత్వం వహించిన ఈ చిత్రం, బీ బావ్‌కాంగ్ రాసిన Sea Anemone నవల ఆధారంగా రూపొందింది. జెంగ్ కై, లియు హాకున్, రాయ్ చియు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం Netflixలో మాండరీన్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. హిందీ లేదా ఇతర ప్రాంతీయ భాషల ఆడియో కూడా లేకపోవడంతో ఇంగ్షీషులోనే చూడాలి. క్రైమ్ మిస్టరీలు, మైండ్ గేమ్స్, ట్విస్టులతో కూడిన కథలు ఇష్టమైతే దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు.

Tags

Related News

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

రియాలిటీ షోస్ నుండి యానిమేషన్ వరకు… జియోహాట్‌స్టార్ లో ఈ వారం సిరీసుల సందడి

రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్

అందమైన అమ్మాయిలతో ట్రాప్ చేయించి ఇదేం పాడు పని… అనుమానంతో అరాచకం

పెళ్లి కాకుండానే పేరెంట్స్… వియ్యంకుల మధ్య మొదలైన వింత బంధం… ఫీల్ గుడ్ కొరియన్ సిరీస్ తెలుగులో

Big Stories

Advertisement
×