E-Paper
Advertisement

నడిరోడ్డుపై డెలివరీ బాయ్స్ నరకం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

నడిరోడ్డుపై డెలివరీ బాయ్స్ నరకం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
Advertisement

Gig Workers: హైదరాబాద్ మహా నగరంలో వివిధ ప్లాట్‌ ఫారమ్‌లలో గిగ్, డెలివరీ కార్మికులుగా పని చేస్తున్న వారి సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం, జెప్టో సంయుక్తంగా ‘ప్రాజెక్ట్ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో 5 ప్రగతి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం, జెప్టో మధ్య బుధవారం అవగాహన ఒప్పందం కుదిరింది. రోజువారీ విధుల్లో భాగంగా ఎక్కువ సమయం రహదారులపై గడిపే గిగ్ కార్మికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా ఉభయ సంస్థలు పేర్కొన్నాయి.

హీట్ వాచ్ సర్వే ప్రకారం..

2024లో హైదరాబాద్‌లో 166 మంది గిగ్, ప్లాట్‌ ఫారమ్ కార్మికులపై నిర్వహించిన హీట్ వాచ్ సర్వే ప్రకారం సుమారు 69 శాతం మంది కార్మికులకు పరిశుభ్రమైన మరుగుదొడ్ల సదుపాయం అందుబాటులో లేదని, 80 శాతానికి పైగా కార్మికులకు పని సమయంలో నీడలో విశ్రాంతి తీసుకునేందుకు అనుకూలమైన సదుపాయాలు లేవని వెల్లడైనందున వారికి మెరుగైన సౌకర్యలను కల్పించేందుకు ఈ ప్రాజెక్టు ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రగతి కేంద్రాలు కేవలం జెప్టో డెలివరీ భాగస్వాములకే కాకుండా క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్, అపారెల్, లాతర లాస్ట్-మైల్ డెలివరీ రంగాల్లో పనిచేస్తున్న గిగ్ కార్మికులందరికీ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆయా కేంద్రాల ప్రదేశాలను ప్రభుత్వం, జెప్టో సంయుక్తంగా గుర్తించనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Also read: ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రగతి కేంద్రాల్లో అందించే సదుపాయాలు..

ప్రతి ప్రగతి కేంద్రంలో గిగ్ కార్మికుల కోసం అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ సురక్షితమైన విశ్రాంతి స్థలం, పరిశుభ్రమైన తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకురావటంతో పాటు ప్రథమ చికిత్స, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయం, వైఫై కనెక్టివిటీ, సమయానుకూలంగా ఆరోగ్య శిబిరాలు, అర్హత కలిగిన గిగ్, అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ్ నమోదుపై అవగాహన కల్పించటం వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణకు తమ తరపున నిరంతరం నిధులు సమకూర్చనున్నట్లు జెప్టో వెల్లడించింది. మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ హైదరాబాద్ నగర ఆర్థిక వ్యవస్థలో గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులు కీలకంగా మారుతున్నారని పేర్కొన్నారు. పని విధానాలు మారుతున్న నేపథ్యంలో, రహదారులపై పనిచేసే కార్మికుల రోజు వారీ మౌలిక అవసరాలను నగరాలు దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ ప్రగతి ద్వారా వివిధ ప్లాట్‌ఫారమ్‌లకు చెందిన కార్మికులందరికీ ఉపయోగపడే సౌకర్యవంతమైన కేంద్రాలు ఏర్పడతాయని, హైదరాబాద్‌లోని విస్తృత గిగ్ వర్కర్ సమాజానికి మద్దతు అందించేందుకు జెప్టో భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు.

జెప్టో స్టోర్ నెట్‌వర్క్‌లో..

Advertisement

జెప్టో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వికాస్ శర్మ మాట్లాడుతూ భారతదేశంలో గిగ్ వర్క్‌ఫోర్స్ 2020–21లో 77 లక్షల నుంచి 2029–30 నాటికి 2.35 కోట్లకు పెరుగుతుందని అంచనాలున్నట్లు ఆయన తెలిపారు. ఈ రంగం విస్తరిస్తున్న కొద్దీ, కార్మికులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని తెలిపారు. జెప్టో స్టోర్ నెట్‌వర్క్‌లో ఇప్పటికే డెలివరీ భాగస్వాములకు తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి ప్రదేశం, మొబైల్ ఛార్జింగ్, ప్రథమ చికిత్స వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ప్రాజెక్ట్ ప్రగతి ద్వారా ఈ సదుపాయాలను అన్ని ప్లాట్‌ఫారమ్‌ల గిగ్ కార్మికులకు విస్తరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి, ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా తదితరులు, అధికారులు పాల్గొన్నారు. మొత్తానికి అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్న గిగ్ వర్కర్లకు ప్రాజెక్ట్ ప్రగతి తో హైదరాబాద్ లో సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఒక అడుగు ముందుకు పడింది.

Also read: పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. క్షణాల్లో ప్రమాదం..!

Tags

Related News

జీహెచ్ఎంసీలో రెనొవేషన్ దందా కలకలం.. ఆఫీసర్ల మోజుకు కోట్లు ఖర్చు!

పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. క్షణాల్లో ప్రమాదం..!

ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

శామీర్‌పేట్‌లో కాంగ్రెస్ నాయకులు ఫైర్.. BRS ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేయాలని డిమాండ్!

1980s ట్రెండ్.. అచ్చం హీరోలా సీఎం రేవంత్, ఓల్డ్ ఈజ్ గోల్డ్

అదుపు తప్పిన లారీ.. డ్రైవర్‌ సహా 200 గొర్రెలు సజీవదహనం.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం

మూసీ నది ప్రాజెక్టు.. దసరా రోజు నుంచి పనులకు శ్రీకారం, ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

Big Stories

Advertisement
×