Satyasri about Chammak Chandra:జబర్దస్త్..బుల్లితెరపై టెలీకాస్ట్ అయిన ఈ కామెడీ షో కి కొన్ని కోట్ల మంది ఫ్యాన్ ఉన్నారనడంలో ఆశ్చర్యంలేదు. ఇక ఇది ఇంతలా సక్సెస్ అవడానికి కారణం తెరపైన నటించే వాళ్ళ మధ్య ఉండే కెమిస్ట్రీ పండడమే. అలా ఒక్కొకరు తమదైన టాలెంట్ చూపించి స్టార్ గా ఎదిగారు కూడా.
ఇక వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చమ్మక్ చంద్ర గురించి. ఆయన వేసే లేడీ గెటప్ లు, అందులో ఆయన పండించే కామెడీ నెక్స్ట్ లెవెల్. ఇక చంద్ర తన తో కలిసి నటించే సత్యశ్రీతో ఎలాంటి రచ్చ చేస్తాడో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన భార్యాభర్తల స్కిట్లు అయితే నవ్వించి ఆడియన్స్ కళ్ళల్లో నీళ్ళు తెప్పించేవి .అలా చంద్ర తో నవ్వుల వర్షం కురిపించిన సత్య శ్రీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చమ్మక్ చంద్ర పర్‌ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ ఆకాశానికెత్తేసింది.
also read :నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ
మగాడు అనే విషయం కూడా మర్చిపోయేంతలా
చమ్మక్ చంద్ర మగాడు అనే విషయం కూడా మర్చిపోయేంతలా స్కిట్లలో ఆడవాళ్ల పాత్రల్లో జీవించేస్తాడని, అంత పర్ఫెక్ట్‌గా ఆ పాత్రలను పండించడం నిజమైన ఆడవాళ్లకు కూడా సాధ్యం కాదేమో అనిపిస్తుందని ప్రశంసల వర్షం కురిపించింది. ముఖ్యంగా స్కిట్ మధ్యలో ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్సే ప్రతీ షోకి అసలైన హైలైట్‌గా నిలుస్తాయని, ఆ కామెడీ టైమింగ్, నేచురల్ నటన వల్లే ఆ షోలు అంతటి పాపులారిటీని సొంతం చేసుకున్నాయని చెప్పుకొచ్చింది.
also read :యష్ ‘టాక్సిక్’ షాకింగ్ అప్‌డేట్..వీళ్ళు మాత్రం థియేటర్లకి రాకండి!
మొదట్లో జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యశ్రీ, ఆ తర్వాత చమ్మక్ చంద్ర టీమ్‌లోనే కాకుండా విడిగా కూడా ఎన్నో కామెడీ స్కిట్లలో నటిస్తూ బుల్లితెరపై స్టార్ లేడీ కమెడియన్‌గా ఎదిగింది. తన ఎక్స్‌ప్రెషన్స్, పంచ్ డైలాగ్స్, సరైన టైమింగ్ తో ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
చమ్మక్ చంద్ర విషయానికి వస్తే
ఇక చమ్మక్ చంద్ర విషయానికి వస్తే స్మాల్ స్క్రీన్ పై లేడీ గెటప్స్, తనదైన బాడీ లాంగ్వేజ్‌తో క్రేజ్ తెచ్చుకున్న చంద్ర వెండితెరపై కూడా మంచి పాత్రలతో మెప్పించారు.అలా 2013 లో వచ్చిన ‘స్వామి రారా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, 2014 లో వచ్చిన ‘మనం’ చిత్రంలో నటించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత 2017లో వచ్చిన ‘శతమానం భవతి’ సినిమాలో కూడా మంచి పాత్రనే దక్కించుకున్నాడు.అంతేకాదు, 2018లో వచ్చిన ‘టాక్సీవాలా’, 2019లో వచ్చిన సూపర్ హిట్ క్రైమ్ కామెడీ ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల్లో చంద్ర చేసిన పాత్రలు ప్రేక్షకులను మెప్పించినవే.
also read :ఏంటీ..ఒడిస్సీ కి ఇండియాలో వంద కోట్లా ?
ఇక చమ్మక్ చంద్ర, సత్యశ్రీల కాంబినేషన్ విషయానికి వస్తే వీరి జోడీకి ఉన్న పాపులారిటీ ఏంటో వాళ్ళు చేసిన వీడియో లకి వచ్చిన మిలియన్ల కొద్దీ వ్యూసే చెబుతుంటాయి. ఇక తాజాగా సత్యశ్రీ చేసిన ఈ కామెంట్స్ చూసి చమ్మక్ చంద్రా మజాకా అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు చమ్మక్ ఫ్యాన్స్ !