BigTV English

OTT Movie : భార్యాభర్తల మధ్యలో పనిమనిషి… ఈ యవ్వారం ఏదో తేడాగా ఉంది మావా… స్ట్రిక్ట్లీ సింగిల్స్ కి మాత్రమే

OTT Movie : భార్యాభర్తల మధ్యలో పనిమనిషి… ఈ యవ్వారం ఏదో తేడాగా ఉంది మావా… స్ట్రిక్ట్లీ సింగిల్స్ కి మాత్రమే

OTT Movie : ఓటీటీలో పెద్దలకు మాత్రమే అని ఉన్న కంటెంట్ కు కూడా ఏమాత్రం ఫాలోయింగ్ తగ్గట్లేదు. ఇదివరకు ఏ ప్లస్ రేటింగ్ ఉందంటే చాలు జడుసుకునే వారు. కానీ ఇప్పుడు తరంతో పాటు అందరి అభిరుచి కూడా మారిపోయింది. అందుకే ఇలాంటి సినిమాలను ఎలాంటి మొహమాటం లేకుండా చూస్తున్నారు. అయితే ఇంట్లో ఉన్నప్పుడు చిన్న పిల్లలు, పెద్ద వాళ్ళతో కాస్త జాగ్రత్త పడుతున్నారు. ఇక పార్ట్నర్స్, సింగిల్స్ కు ఇలాంటి సినిమాల పట్ల ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి పార్ట్నర్స్ కోసమే ఈ ఇంట్రెస్టింగ్ మూవీ. ఈ మూవీ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ మూవీ పేరు “Viddana”. 2020లో రిలీజ్ అయిన ఈ మూవీ ఖ్రిస్టినా సివోలాప్ దర్శకత్వంలో రూపొందిన పోలిష్-ఉక్రేనియన్ హిస్టారికల్, ఫాంటసీ డ్రామా. ఇది సోఫియా ఆండ్రుఖోవిచ్ రాసిన “Felix Austria” నవల ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో మరియానా జానుస్జెవిచ్ (స్టెఫానియా చోర్నెంకో), అలేసియా రొమానోవా (అడెలా), రోమన్ లుట్స్కీ (పెట్రో) మెయిన్ లీడ్స్ గా నటించారు. 1900ల ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యంలోని ఇవానో-ఫ్రాంకివ్స్క్ (అప్పటి స్టానిస్లావ్) నగరం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగే అరాచకాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.


కథలోకి వెళ్తే…

స్టెఫానియా చోర్నెంకో (మరియానా జానుస్జెవిచ్) అనే యంగ్ ఉక్రేనియన్ మహిళ చుట్టూ తిరుగుతుంది ఈ మూవీ కథ. ఆమె అడెలా స్కోలీ (అలేసియా రొమానోవా) అనే ఒక ధనిక పోలిష్-ఆస్ట్రియన్ మహిళకు సేవకురాలిగా పని చేస్తుంది. స్టెఫానియా, అడెలా ఒకే వయసు అమ్మాయిలు. పైగా చిన్నతనం నుండి కలిసి పెరిగారు. ఒక అగ్నిప్రమాదంలో స్టెఫానియా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అడెలా కుటుంబం ఆమెను దత్తత తీసుకుంటుంది. ఈ దత్తత స్టెఫానియాను అడెలాకు సేవకురాలిగా మార్చినప్పటికీ, వారి మధ్య సిస్టర్స్ లాంటి బంధం ఏర్పడుతుంది.

స్టెఫానియా ఒక మంచి గృహిణి. ఆమె రుచికరమైన వంటకాలు చేయడంతో పాటు ఇంటి పనుల్లో తన నైపుణ్యం చూపిస్తూ అడెలా కుటుంబాన్ని సంతోష పెడుతుంది. అయితే ఆమెకంటూ స్వంత కలలు, ఆకాంక్షలు ఉంటాయి. ఇవి ఆమె సేవకురాలి జీవితం వల్ల అణచి వేసుకుంటుంది. మరోవైపు అడెలా ఒక గ్లామరస్, స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని గడుపుతుంది. ఆమె భర్త పెట్రో స్కోలీ (రోమన్ లుట్స్కీ) ఒక శిల్పి, ఆమెపై తెగ ప్రేమను కురిపిస్తాడు.

ఈ క్రమంలోనే స్టెఫానియా రహస్యంగా పెట్రో పట్ల ఆకర్షణను పెంచుకుంటుంది. ఇది ఆమె, అడెలా మధ్య గొడవలను పెంచుతుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఇలా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నది స్టెఫానియా మాత్రమే కాదు పెట్రో కూడా. అతను తన భార్య అడెలా రిచ్ లైఫ్ స్టైల్ ను మెయింటైన్ చేయడానికి ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడతాడు. క్లైమాక్స్‌లో స్టెఫానియా తన బాధ్యత, వ్యక్తిగత కోరికలలో ఏదో ఒక ఆప్షన్ ను ఎంచుకోవాల్సి వస్తుంది. ఇంతకీ స్టెఫానియా ఏ ఆప్షన్ ఎంచుకుంది? అడెలా, పెట్రో కలిసే ఉన్నారా? విడిపోయారా? అన్న విషయాలను తెరపై చూడాల్సిందే. ఈ మూవీ పెద్దలకు మాత్రమేనని మర్చిపోకండి.

Read Also : ఈ మూవీకి ఓటీటీలో 50 మిలియన్ల వ్యూస్.. ప్రతి సీను క్లైమాక్సే.. అస్సలు మిస్ అవ్వకండి

Related News

OTT Movie : సీరియల్ కిల్లర్ వరుస మర్డర్స్… చూసిన వాళ్ళను వదలకుండా ముక్కలు ముక్కలుగా నరికి… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

OTT Movie : దొంగ పేర్లతో అమ్మాయిలతో ఆడుకునే సైకో… హీరోనే విలన్ అయితే… మైండ్ బెండయ్యే మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఆచారాల పేరుతో అమ్మాయిలతో ఏకాంతంగా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : మర్డర్ కేసులో ఇరుక్కునే మెంటలోడు… ఆ తల్లి చేసే అడ్వెంచర్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మావా

OTT Movie: పక్కింటి ఆంటీపై కోరిక.. చివరికి గుడిలో ఆమెతో అలాంటి పని.. కవ్విస్తూనే చివరికి కన్నీరు పెట్టించే మూవీ

OTT Web Series: ఈ 10 వెబ్ సీరిస్‌లు చూస్తే రాత్రంతా జాగారమే.. హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూడండి మామ!

OTT Movie : పార్టీ చేసుకుంటే వీడి చేతిలో చావే… జనాల్ని గడగడా వణికించే సీరియల్ కిల్లర్… నరాలు తెగే సస్పెన్స్

OTT Movie : భర్త ఉండగానే మరో అబ్బాయితో… సీక్రెట్ ప్రియుడి హత్యతో అల్టిమేట్ ట్విస్ట్… గ్రిప్పింగ్ కన్నడ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

×