BigTV English

OTT Movie: ఈ మూవీకి ఓటీటీలో 50 మిలియన్ల వ్యూస్.. ప్రతి సీను క్లైమాక్సే.. అస్సలు మిస్ అవ్వకండి

OTT Movie: ఈ మూవీకి ఓటీటీలో 50 మిలియన్ల వ్యూస్.. ప్రతి సీను క్లైమాక్సే.. అస్సలు మిస్ అవ్వకండి

OTT Movie : ఒక ఫాస్ట్-పేస్డ్ యాక్షన్-థ్రిల్లర్ మూవీ ఓటీటీలో దుమ్ము లేపుతోంది. ఈ సినిమా స్టోరీ ఒక G20 సమ్మిట్‌ను ఉగ్రవాదులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో మొదలవుతుంది. ఇక్కడ డానియెల్ సట్టన్ అనే అమెరికన్ అధ్యక్షురాలు, తన సైనిక నైపుణ్యాలను ఉపయోగించి తన కుటుంబాన్ని, దేశాన్ని రక్షించాల్సి వస్తుంది. ఈ స్టోరీ క్రిప్టోకరెన్సీ నేపథ్యంలో జరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో

ఈ అమెరికన్ యాక్షన్-థ్రిల్లర్ మూవీ పేరు ‘G20’. 2025 లో విడుదలైన ఈ సినిమాకి పట్రిసియా రిగ్గెన్ దర్శకత్వం వహించారు. ఇందులో వియోలా డేవిస్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం కైట్లిన్ పారిష్, ఎరికా వైస్, లోగన్ రాసిన స్క్రిప్ట్ ఆధారంగా రూపొందింది. ఇది 2025, ఏప్రిల్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.


స్టోరీలోకి వెళితే

దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో G20 సమావేశం జరుగుతుంది. అమెరికన్ అధ్యక్షురాలైన డానియెల్ సట్టన్, తన భర్త డెరెక్ సట్టన్, 17 ఏళ్ల కూతురు సెరీనా, కొడుకు డెమెట్రియస్ తో కలిసి ఈ సమావేశానికి హాజరవుతుంది. ఆమెతో పాటు మిగతా దేశాల అధ్యక్షులు కూడా హాజరవుతారు. డానియెల్ సట్టన్ కి ఒకప్పుడు యుద్ధ సైనికురాలిగా మంచి అనుభవం ఉంటుంది. ఇప్పుడు ఈ సమావేశంలో, రైతులకు డిజిటల్ కరెన్సీ ద్వారా ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంటుంది. మరో వైపు బుడాపెస్ట్‌లో, మాజీ ఆస్ట్రేలియన్ స్పెషల్ ఫోర్సెస్ కార్పోరల్ ఎడ్వర్డ్ రట్లెడ్జ్ తన అనుచరులతో కలిసి ఒక మహిళను వెంబడించి, $70 మిలియన్ల క్రిప్టోకరెన్సీ వాలెట్‌ను స్వాధీనం చేసుకుంటాడు.

రట్లెడ్జ్ నేతృత్వంలోని ఉగ్రవాదుల బృందం ఈ G20 సమ్మిట్‌ను తమ అదుపులోకి తీసుకుంటారు. వీళ్ళ ప్రణాళిక ఏమిటంటే, ప్రపంచ నాయకుల గొంతులను ఉపయోగించి డీప్‌ఫేక్ వీడియోలను సృష్టించి, ఒక కొత్త గ్లోబల్ కరెన్సీని ప్రవేశపెట్టడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూల్చివేయాలి. ఆతరువాత బిట్‌కాయిన్ ధరలను పెంచి తమను తాము ధనవంతులను చేసుకోవాలి. ఈ డీప్‌ఫేక్‌లను సృష్టించడానికి, వీళ్ళు నాయకులను ఒక పాంగ్రామ్ చదవమని బలవంతం చేస్తారు. ఈ దాడిలో అనేక మంది బందీలుగా తీసుకోబడతారు. బ్రిటిష్ ప్రధానమంత్రి ఒలివర్ ఎవరెట్, ఇటాలియన్ నాయకురాలు ఎలెనా రొమానో, దక్షిణ కొరియా ఫస్ట్ లేడీ హాన్ మిన్-సియో వంటి వాళ్ళు ఉంటారు. రట్లెడ్జ్ ఉద్దేశాలు కేవలం ఆర్థిక లాభం కోసం మాత్రమే కాకుండా, యుద్ధాలు, విభజనలను సృష్టించిన ప్రపంచ నాయకులపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో కూడా నడుస్తాయి.

డానియెల్ సట్టన్, తన గతంలో తీసుకున్న సైనిక శిక్షణతో, ఉగ్రవాదుల చేతిలో చిక్కకుండా తప్పించుకుంటుంది. తన కుటుంబాన్ని, ఇతర నాయకులను రక్షించడానికి పోరాడుతుంది. ఆమె తన ప్రైమరీ సీక్రెట్ సర్వీస్ బాడీగార్డ్ మానీ రూయిజ్ తో కలిసి పనిచేస్తుంది. అతను ఆమెకు విధేయంగా ఉంటాడు. డానియెల్ ఉగ్రవాదులను గన్‌ఫైట్‌లు, హ్యాండ్-టు-హ్యాండ్ కాంబాట్ వంటి వ్యూహాత్మక చర్యల ద్వారా ఎదుర్కొంటుంది. డానియెల్ కూతురు సెరీనా, ఒక హ్యాకర్‌గా కీలకమైన సమయంలో తన నైపుణ్యాలను ఉపయోగించి సహాయం చేస్తుంది. చివరికి డానియెల్ ఉగ్రవాదులను ఎలా ఎదుర్కొంటుంది ? అక్కడినుంచి మిగతా వాళ్ళని డానియెల్ కాపాడుతుందా ? ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరుతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ యాక్షన్-థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Read Also : పెళ్ళైన టీచర్ తో ప్రేమ… చివర్లో బుర్రపాడు ట్విస్ట్… మెంటలెక్కించే తమిళ థ్రిల్లర్

Related News

OTT Movie : ట్రిప్పుకెళ్లి టీచర్ తో అర్ధరాత్రి అరాచకం… సైకో ట్రాప్ లో అడ్డంగా బుక్కయ్యే అమాయకురాలు… బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : విమానంలో వైరస్ లీక్… పిచ్చోడు చేసే మెంటల్ పనికి పైప్రాణాలు పైనే… సీను సీనుకో ట్విస్ట్ మావా

OTT Movie : భర్త చనిపోయాడని చెప్పి భార్యను లాక్కునే ఆఫీసర్… అతను తిరిగొచ్చి ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : మనుషుల్ని చూస్తుండగానే మసి చేసే సైకో… ఎవెంజర్స్ ను మించిన శక్తి… ఓటీటీలో గత్తరలేపుతున్న సూపర్ హీరో మూవీ

OTT Movies: దొంగచాటుగా పక్కింటి అమ్మాయిని ‘అలా’ చూస్తాడు.. తర్వాత వాడికి నరకమే, సినిమా మొత్తం అలాంటి సీన్లే!

OTT Movie : ట్రాప్ చేసి పాడు పనులు… ఈ కేటుగాళ్ల టార్గెట్ అమ్మాయిలే… దిమాక్ ఖరాబ్ చేసే రియల్ రివేంజ్ స్టోరీ

Big Stories

×