Nidhi Agarwal : టాలీవుడ్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సవ్యసాచి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మూవీ హిట్ అవ్వకున్నా కూడా నిధి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. తెలుగులో సాలిడ్ హిట్ సినిమా అయితే పడలేదు. తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కొన్ని సినిమాల్లో నటించి పర్వాలేదనే టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో భారీ ప్రాజెక్టులలో నటిస్తుంది. ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి హీరోల సినిమాల్లో నటిస్తుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది.. ప్రస్తుతం అది చర్చినీయాంశంగా మారింది..
నిధి అగర్వాల్ పోస్ట్ వైరల్..
టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈమధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు తన సినీ కెరీర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు ‘నేను యాక్సిడెంటల్ యాక్టర్‌ని కాదు.. నిజానికి నాకు సినిమాలు అంటే చాలా పిచ్చి. ఆ పిచ్చితోనే ఎన్నో ఆడిషన్‌కి వెళ్ళాను. నాకు ఉన్న ఏకైక కల హీరోయిన్ కావడం. దాని కోసం ఎంతో కష్టపడ్డాను. ఇదంతా వర్కౌట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. త్వరలో రెండు బిగ్గెస్ట్ ప్రాజెక్టులతో మీ ముందుకు రాబోతున్నాను.. ఆ రెండు సినిమాలు నా కలలను నిజం చేస్తాయని భావిస్తున్నాను అంటూ ఆమె పోస్ట్ చేశానని అన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read :‘గుండెనిండా గుడిగంటలు’ బాలు సీరియల్స్ లోకి రాకముందే ఏం పని చేశాడో తెలుసా..?
నిధి అగర్వాల్ సినిమాలు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నా స్టార్ హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి మూవీతో తెలుగు ధరకు పరిచయమైంది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి సక్సెస్ సాధించింది. అయితే ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు ఏమీ వచ్చు పడిపోలేదు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పూర్తయినంతవరకు మరో సినిమా చేయను అని అగ్రిమెంట్లో సంతకం పెట్టిందని టాక్.. రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే మరో సినిమాలో నటించే అవకాశం ఉందని సమాచారం. ఏది ఏమైనా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం ఉండాలి అని పలువురు ఆమెపై ప్రశంసలు కురి ఇప్పటివరకు ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలలోనే నటించింది. హరిహర వీరమల్లు పై ఆశలు పెట్టుకుంది. ఈ మూవీ కనక భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే నిధికి ఇక తెలుగులో తిరిగే ఉండదు. స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగిపోతుంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా అంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది.పిస్తున్నారు. తెలుగు తో పాటు నిధి తమిళ్లో కూడా సినిమాలు చేస్తూ వస్తుంది.
I am not an accidental actor.. I have auditioned and been lucky to make it.. for one and only reason which is ‘I am obsessed with cinema’.. and my only dream ever has been to become an actress.. I hope it all works out.. god willing 🙏🏼🌟🤍🪷🔥 https://t.co/fP6RXIuKJk
— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) July 12, 2025