BigTV English

Kota Srinivas Rao Death: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాస్ రావు కన్నుమూత

Kota Srinivas Rao Death: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాస్ రావు కన్నుమూత

Kota Srinivas Rao Death : టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానంని క్రియేట్ చేసుకున్న నటులలో ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు ఒకరు. విలన్ గా, హీరోగా, కమెడియన్ గా ఇలా ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయ లో చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడుగా ఆయన 750 కి పైగా సినిమాలు చేశారు. ప్రస్తుతం వయో భారంతో సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.. అయితే గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో కోటా శ్రీనివాసరావు పోరాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన తుది శ్వాస విడిచారు. ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.. కోట శ్రీనివాసరావు మృతి వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.. విలక్షణ పాత్రలో నటించి మెప్పించిన ఈయన లాంటి గొప్ప నటుడిని కోల్పోవడం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి భారీగా సినీ ప్రముఖులు హాజరుకానున్నారు..


అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న కోటా..

టాలీవుడ్ ప్రముఖ నటుడు కోటా శ్రీనివాస్ రావు ఇవాళ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా తీవ్ర అస్వస్థత తో భాధపడుతున్న ఆయన ఫిల్మ్ నగర్లోని తన స్వగృహంలోనే మరణించారు.. వయసు మీద పడటంతో నడవలేని స్థితిలో ఉన్నా రెండేళ్ళ క్రితం వరకూ ల్లో నటించారు. ఆయనా చివరి 2023లో రిలీజైన ‘సువర్ణ సుందరి’.. నాలుగూదశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించారు కోటా శ్రీనివాసరావు. 750 కు పైగా చిత్రాల్లో నటించారు. కోట మృతిలో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతి వార్త విన్న ఎందరో ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలను, కలిసి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలువురు తిని ప్రముఖులు ఆయన స్వగృకానికి వెళ్లి భౌతికాయాన్ని సందర్శించినట్లు తెలుస్తుంది.. నేడు సినీ ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను కుటుంబ సభ్యులు జరిపించనున్నారు. ఆ కార్యక్రమానికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు, హీరోయిన్లతో పాటు పలువురు నటీనటులు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.


కోటా సినీ ప్రస్థానం..

కోట శ్రీనివాసరావు జననం 1942 జూలై 10 తెలుగు సినిమా నటుడు. అతను తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో కూడా కొన్ని చిత్రాలలో నటించాడు. మాజీ రాజకీయవేత్తగా, శ్రీనివాసరావు 1999 నుండి 2004 వరకు భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. అతను 1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో తన అరంగేట్రం చేసాడు.. విలన్ గా, కమెడియన్ గా, తండ్రిగా, తాతగా ఇలా ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసులో కోట చెరగని ముద్ర వేసుకున్నారు. ఇండస్ట్రీలో అందరూ హీరోలతో పని చేసిన వ్యక్తి కోటా.. చిరంజీవి నుంచి మొదలుకొని నాగర్జున వంటి హీరోలతో పాటుగా ఈతరం హీరోలతో స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈయన దాదాపు 750 కి పైగా సినిమాలలో నటించారు. ఈమధ్య వయసు పై పడటంతో సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. గత కొద్దిరోజులుగా అని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కోటా శ్రీనివాస్ రావు.. నేడు తుది శ్వాస విడిచారు. కోట శ్రీనివాసరావు తన ఇద్దరు కుమారులను కోల్పోయిన విషయం తెలిసిందే..

Related News

Kishkindha Puri: కిష్కిందపురి బిజినెస్.. టార్గెట్ చాలా చిన్నదే… కానీ సమస్య ఇదే

Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటికి డీఆర్ఐ భారీ షాక్..ఏకంగా 102 కోట్లు ఫైన్.. మిగతా వారికి?

Kishkindapuri Censor: కిష్కంధపురి సెన్సార్… అంతలా ఏం ఉందయ్యా… ఆ సర్టిఫికేట్ ఇచ్చారు

HBD Pawan Kalyan: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సెట్‌ ఫోటో లీక్‌ చేసిన రాశీ ఖన్నా.. పిక్‌ వైరల్‌

Samantha: రాజ్ తో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన సమంత.. వీడియో వైరల్!

OG Glimpse: హైప్‌ పెంచుతున్న ‘ఓజీ’ గ్లింప్స్‌.. పవన్‌ లుక్‌కి గూస్‌బంప్సే.. చూశారా?

Big Stories

×