E-Paper
Advertisement

ఈత నేర్పిస్తూ అమ్మాయిని బుట్టలో వేసే కుర్రాడు… లవర్స్ చూడాల్సిన చూడచక్కని సినిమా

ఈత నేర్పిస్తూ అమ్మాయిని బుట్టలో వేసే కుర్రాడు… లవర్స్ చూడాల్సిన చూడచక్కని సినిమా
Advertisement

Romantic Movie OTT : ఓటీటీలో ఓ మంచి రొమాంటిక్ మూవీ కోసం వెతుకుతున్నారా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఇందులో మనసుకు హత్తుకునే అందమైన ప్రేమ కథ ఉంటుంది. మరి ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

కేట్ మార్చారేలా రాసిన ప్రసిద్ధ వాట్‌ప్యాడ్ (Wattpad) అనే నవల ఆధారంగా తెరకెక్కించిన అందమైన రొమాంటిక్ డ్రామా ‘Float (2023)’. ఈ మూవీకి షెరీల్ లీ దర్శకత్వం వహించగా, రాబీ అమోల్, ఆండ్రియా బాంగ్ మెయిన్ లీడ్స్ గా నటించారు. ఈ సినిమా ఇప్పుడు Lionsgate Play ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు Amazon Prime Video లో లైన్స్‌గేట్ ప్లే ఛానెల్ ద్వారా కూడా వీక్షించే ఛాన్స్ ఉంది. ఒక ప్రశాంతమైన బీచ్ వాతావరణంలో, మంచి మ్యూజిక్‌తో సాగే ఒక పీస్ ఫుల్ లవ్ స్టోరీ ఇది. ప్రశాంతంగా ఉండే ఒక మంచి ఫీల్ గుడ్ ప్రేమ కథను చూసి ఆస్వాదించాలి అనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్

కథలోకి వెళ్తే…

Advertisement

ఒక చైనీస్-అమెరికన్ మెడికల్ స్టూడెంట్ చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. ఆమె పేరు వేవ్‌లీ (ఆండ్రియా బాంగ్). పై చదువుల కోసం టొరంటో వెళ్లే ముందు కాస్త ప్రశాంతత కావాలని అనుకుంటుంది. అందుకోసం వేసవి సెలవుల్లో కెనడాలోని ఒక చిన్న తీరప్రాంత పట్టణానికి వెకేషన్ కోసం వస్తుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే ఆమెకు అస్సలు ఈత కొట్టడం రాదు. అంతేకాదు నీళ్లంటే ఒక రకమైన భయం కూడా ఉంటుంది. ఒకరోజు రాత్రి అనుకోకుండా పార్టీలో ఆమె నీటిలో పడి బయట పడడానికి కొట్టుమిట్టాడుతుంది. అంతలోనే అక్కడ లోకల్ లైఫ్‌ గార్డ్‌ గా పని చేసే బ్లేక్ అనే వ్యక్తి ఆమె మునిగిపోకుండా కాపాడతాడు.

Also Read : ద్వీపంలో చిక్కుకునే చిన్నపిల్లలు… చూస్తున్నంత సేపు ఒళ్ళు గగుర్పొడిచే ఉత్కంఠభరితమైన సిరీస్

Advertisement

ఇక్కడే స్టార్ట్ అవుతుంది లవ్ స్టోరీ. ఈ పరిస్థితి తర్వాత బ్లేక్ ఆమెకు ఈత నేర్పించడానికి ఒప్పుకుంటాడు. నీటిపై తేలడం నేర్చుకునే క్రమంలో ఇద్దరూ దగ్గరవుతారు. ఈ నేపథ్యంలో స్విమ్మింగ్ విషయంలో వేవ్‌లీ తన మనసులోని భయాలను ఒక్కొక్కటిగా అధిగమించి, బాగా ప్రాక్టిస్ చేస్తుంది. అలాఅలా వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని, ప్రేమలో మునిగిపోతారు. అయితే అప్పటిదాకా వేవ్‌లీ తన తల్లిదండ్రుల కోరికల ప్రకారమే బతకడానికి అలవాటు పడి ఉంటుంది. కానీ బ్లేక్ ఆమెకు జీవితాన్ని స్వేచ్ఛగా ఆస్వాదించడం ఎలా అన్నది నేర్పిస్తాడు. ఇక్కడిదాకా అంతా బాగానే సాగుతుంది. సెలవులు పూర్తి కావడంతో వేవ్ ఆ ఊరిని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే మన హీరోకు కుటుంబ బాధ్యతలు ఉండడంతో ఆ ఊరిని వదిలి వెళ్ళే పరిస్థితి ఉండదు. మరి ఇలాంటి సిట్యుయేషన్ లో ఈ ప్రేమికులిద్దరూ ఏం చేశారు ? చివరికి వీళ్ళ ప్రేమ ఎలాంటి టర్న్ తీసుకుంది ? అన్నది స్టోరీ.

Related News

పెళ్ళయిన వ్యక్తితో రిలేషన్ లో… మెదడును కదిలించే క్లైమాక్స్

లవర్ కు మతిమరుపు వస్తే… కన్నీళ్ళు పెట్టించే తెలుగు రొమాంటిక్ డ్రామా

గర్ల్ ఫ్రెండ్ కోసం కుక్కను తెచ్చి కొత్త చిక్కుల్లో… డాగ్ లవర్స్ డోంట్ మిస్

ఒకరి తర్వాత ఒకరు సైకోలుగా మారి హత్యలు చేసే పేరున్న వ్యక్తులు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్

50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×