E-Paper
Advertisement

 హర్రర్ నుంచి హీస్ట్ థ్రిల్లర్ వరకు ఈ వారం ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సినిమాలు… ఈ తెలుగు సినిమాలు మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు

 హర్రర్ నుంచి హీస్ట్ థ్రిల్లర్ వరకు ఈ వారం ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సినిమాలు… ఈ తెలుగు సినిమాలు మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు
Advertisement

Weekend OTT Releases: వీకెండ్ వస్తోందంటే చాలు, మనలో చాలామంది ఏ ఓటీటీలో ఏ కొత్త సినిమా రిలీజ్ అవుతుందా, ఏ వెబ్ సిరీస్ ట్రెండ్ అవుతుందా అని నెట్టింట గాలిస్తుంటాం. రకరకాల జోనర్లలో సూపర్ హిట్ ప్రాజెక్ట్స్ క్యూ కడుతుండటంతో ఈ వీకెండ్ డిజిటల్ స్క్రీన్స్ మీద పండగ వాతావరణం కనిపించబోతోంది. ముఖ్యంగా అచ్చ తెలుగు సినిమాలు, ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్లు, మలయాళం సర్వైవల్ డ్రామాలు, తమిళ మాస్ కంటెంట్ నుంచి బాలీవుడ్ క్రైమ్ కథల వరకు ఈ వారం ఆడియన్స్‌ని కట్టిపడేయడానికి సరికొత్త కంటెంట్ సిద్ధంగా ఉంది. సినిమా ప్రియులకు గూస్‌బంప్స్ తెప్పించే ఆ మోస్ట్ అవైటింగ్ మూవీస్, సిరీస్ డిటేల్స్ ఏంటో ఒక్కసారి డీటెయిల్‌గా లుక్ వేద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్ లోనే రెండు సినిమాలు

మొదటగా మన టాలీవుడ్ నుంచి వస్తున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ Sub-Inspector Yugandhar మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రంలో సస్పెన్స్ ఎలిమెంట్స్ నెక్స్ట్ లెవెల్‌ లో డిజైన్ చేశారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో జరిగే పవర్ పాలిటిక్స్, ఒక హై-ప్రొఫైల్ కేసును చేధించే క్రమంలో ఎదురయ్యే ఊహించని అడ్డంకులు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. పోలీస్ కస్టడీ నుంచి ఒక డెడ్ బాడీ మిస్ కావడంతో మొదలయ్యే ఈ కథ, ఆ తర్వాత అనూహ్య మలుపులతో ఆడియన్స్‌ని చివరి వరకు సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. ఆది సాయికుమార్ నటిస్తున్న ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అక్టోబర్ 30న విడుదలవుతోంది. ఇక స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్న తాజా తమిళ చిత్రం Baththa కూడా అక్టోబర్ 29న తెలుగు, హిందీ సహా పలు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పర్ఫెక్ట్ కామెడీ, మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్దే కాదు, ఓటీటీ ఆడియన్స్‌ని కూడా కడుపుబ్బా నవ్విస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. అలాగే నెట్‌ఫ్లిక్స్ నుంచి వస్తున్న క్రేజీ యాక్షన్ మూవీ Sigma కూడా ఇదే లిస్ట్ లో ఉంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం అక్టోబర్ 30న స్ట్రీమింగ్ కానుంది.

ఈ 3 డోంట్ మిస్

Advertisement

ఇక వెబ్ సిరీస్ లవర్స్ కోసం నెట్‌ఫ్లిక్స్‌లో వస్తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ Akka. ఈ సిరీస్‌ హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రానుంది. దీనిపై డిజిటల్ సర్కిల్స్‌లో భారీ హైప్ ఉంది. ఎందుకంటే ఎనభైల నాటి పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో, ఒక పవర్ ఫుల్ సొసైటీ నేపథ్యంలో సాగే ఈ కథలో ఉమెన్ సెంట్రిక్ పవర్ గేమ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. పాత్రల మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్స్, డైరెక్టర్ టేకింగ్ ఈ సిరీస్‌ను ట్రెండింగ్‌లో నిలబెట్టడం పక్కా. కీర్తి సురేష్ లీడ్ రోల్‌లో నటించిన ఈ పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అక్టోబర్ 30 నుంచి అందుబాటులోకి వస్తుంది. వీటితో పాటు సోనీలివ్‌లో వస్తున్న తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ Immortal, జియో హాట్‌స్టార్‌లో వస్తున్న రొమాంటిక్ తమిళ సిరీస్ Love Always వంటి ప్రాజెక్ట్స్ ఈ వీకెండ్‌ని టోటల్లీ రప్ఫాడించడం గ్యారెంటీ. ఈ రెండూ కూడా అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక వర్కింగ్ డేస్ టెన్షన్ అంతా పక్కన పెట్టి, ఈ వీకెండ్ ఈ వైవిధ్యమైన కంటెంట్‌ తో మీ ఫ్యామిలీతో సరదాగా ఇంట్లోనే ఈ 6 సినిమాలు, సిరీస్ లు చూడడం స్టార్ట్ చేసేయండి మరి.

Read Also: లావుగా ఉందని అవమానించారు… అదే ఆటతో ఇండియాకే పేరు తెచ్చిన అమ్మాయి… ఇన్స్పైరింగ్ రియల్ స్టోరీ

Tags

Related News

This Week OTT Releases : ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

జగపతిబాబు షోలో బాలయ్య రహస్యాలు రివీల్ చేసిన నారా లోకేష్!

ప్రేమ కోసం షోలోకి… కెమెరాలు ఆగాక వాళ్ల బంధాలు ఏమయ్యాయి ? క్రేజీ కొరియన్ సిరీస్

చక్రవర్తి సింహాసనానికే ఎసరు పెట్టే నింజాలు… ఒక్క సీక్రెట్ బయటకొస్తే బ్లడీ బ్లడ్ బాత్… యాక్షన్ తో ఇరగదీస్తున్న సిరీస్

సముద్రంలో చిక్కుకున్న అన్నదమ్ములు… ముంచేయడానికి దూసుకొచ్చే పెను తుఫాను… గూస్ బంప్స్ తెప్పించే సర్వైవల్ థ్రిల్లర్

సైంటిస్ట్‌ గా మారిన గొర్రె… ప్రయోగం బెడిసికొట్టి ఊర్లోకి వచ్చే భయంకరమైన మృగం… హాలోవిన్ అంతా రచ్చ రచ్చ

36 ఏళ్ల క్రితం మాయమైన తండ్రి శవం ప్రత్యక్షం… గతం తవ్వితే బయటపడే భయంకర నిజాలు… హర్రర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×