E-Paper
Advertisement

OTT Movie : ఫ్యామిలీ ఫ్యామిలీ సైకోలే… అమ్మాయి కన్పిస్తే అదే పని… ఒళ్ళు గగుర్పొడిచే రియల్ స్టోరీ

OTT Movie : ఫ్యామిలీ ఫ్యామిలీ సైకోలే… అమ్మాయి కన్పిస్తే అదే పని… ఒళ్ళు గగుర్పొడిచే రియల్ స్టోరీ
Advertisement

OTT Movie : కొన్ని స్టోరీలను చూస్తున్నప్పుడు బాడీలో భయం, టెన్షన్ వాటంతట అవే పెరిగిపోతుంటాయి. ఇలాంటి సినిమాల్లో డిస్టర్బింగ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సెన్సిటివ్ గా ఉండేవాళ్ళు చూడాలంటే ఒక సాహసమే అవుతుంది. ఈ స్టోరీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన రియల్ క్రైమ్ ఇన్సిడెంట్ నుండి స్ఫూర్తి పొందింది. ఇది స్లాషర్ థ్రిల్లర్ స్టైల్‌లో ఉంటుంది. ఇండియన్ సినిమాలలో ఇలాంటి థ్రిల్లర్ ఎలిమెంట్స్ రేర్ గా ఉంటాయి. ఈ స్టోరీ ఒక సైకో కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. అనుకోకుండా అతని ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు చిక్కుకోవడంతో అసలు కథ మొదలవుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే

‘వెల్‌కమ్ హోమ్’ (Welcome Home) 2020లో విడుదలైన హిందీ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్. ఇది పుష్కర్ మహా బల్ దర్శకత్వంలో వచ్చింది. ఇందులో కశ్మీరా ఇరానీ, స్వార్డా థిగలే, బోలోరామ్ దాస్, శశి భూషణ్, తీనా భటియా నటించారు. దాదాపు రెండు గంటల నిడివి ఉన్న ఈ సినిమాకి
ఐయండిబిలో 7.3/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా యూట్యూబ్, ప్రైమ్ వీడియో సోనీ లివ్ లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

మహారాష్ట్రలోని ఒక గ్రామంలో అనుజా, నెహా అనే ఇద్దరు యంగ్ స్కూల్ టీచర్స్ ఉంటారు. ఒకరోజు వీళ్ళు జనాభా లెక్కల కోసం డేటా కలెక్ట్ చేయడానికి వేరే గ్రామానికి వెళ్తారు. వీళ్ళు పగలంతా ప్రతి ఇంటికి వెళ్లి డేటా కలెక్ట్ చేసుకుంటారు. అయితే పొద్దు పోయే ముందు. ఆఖరి ఇంటికి వెళతారు. ఆ ఇల్లు గ్రామానికి కాస్త దూరంగా ఉంటుంది. ఆ ఇంట్లో ప్రేరణ అనే గర్భిణీ స్త్రీ వాళ్లను స్వాగతిస్తుంది. ప్రేరణ చాలా ఫ్రెండ్లీగా కనిపిస్తుంది. వాళ్లకు చాయ్ ఇస్తూ, తన భర్త గురించి, గ్రామ జీవితం గురించి చెబుతుంది. అనుజా, నెహా ఆమెతో మాట్లాడుతూ సెన్సస్ ఫార్మ్ నింపుతారు. కానీ ఇల్లు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. లైట్స్ కూడా మసకగా ఉంటాయి. ఇంట్లో ఎవరూ ఉండరు. ప్రేరణ కూడా కొంచెం భయంగా కనిపిస్తుంది. అనుజాకు ఏదో తప్పు జరుగుతుందని అనుమానం వస్తుంది. కానీ చీకటి పడటం, వర్షం కూడా పడటంతో అక్కడ ఆ రాత్రి ఆగిపోతారు.

Read Also : తండ్రి కళ్ళముందే పక్కింటోడితో ఆ పని… చదువుకోవాల్సిన వయసులో ఇదేం పాడు పని పాపా?

Advertisement

అనుజా, నెహా ఇంట్లో ఎక్కువ సమయం గడిపే కొద్దీ, షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ప్రెర్నా ఒక బానిసలాంటి స్థితిలో ఉంటుంది. ఆమె భర్త అని చెప్పిన వ్యక్తి నిజానికి ఒక క్రూరమైన కిల్లర్. అతను ఆ ఇంట్లో మహిళలను కిడ్నాప్ చేసి హింసించి చంపుతుంటాడు. అనుజా, నెహా కూడా ఈ భయంకరమైన ట్రాప్‌లో చిక్కుకుంటారు. ప్రేరణ కూడా ఈ కిల్లర్‌కు బాధితురాలే, కానీ బయటకు రావడానికి భయపడుతుంది. ఇప్పుడు ముగ్గురు మహిళలు కలిసి ఎస్కేప్ అవ్వడానికి ప్లాన్ చేస్తారు. కానీ కిల్లర్ వాళ్లను వదలడు. ఇక ఈ క్లైమాక్స్ కూడా చాలా వైలెంట్ గా ఉంటుంది. కిల్లర్ నుంచి వీళ్ళు తప్పించుకుంటారా ? ఆ కిల్లర్ చేతిలో బలైపోతారా ? అనేది ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×