Hyper Aadi : బుల్లితెర ప్రేక్షకులకు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా పరిచయమయ్యాడు.. తన టాలెంట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకోవడం తో పాటుగా స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్ గా ఛాన్స్ కొట్టేశాడు. ఆది పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఒక వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు జనసేన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటుంటాడు. ఈమధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో ఆది సందడి చేస్తూ వస్తున్నాడు.. ఈయన ఢీ షోలో టీమ్ లీడ్ గా చేస్తున్నాడు. తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో ని రిలీజ్ చేశారు.. ఆ ప్రోమోలో ఆది దీపికపై దారుణమైన కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇది హార్ట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
బ్రహ్మముడి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన దీపిక రంగరాజు గురించి అందరికీ తెలుసు. ఈమధ్య జరుగుతున్న ప్రతి ఈవెంట్లను ఈ అమ్మడు సందడి చేస్తూ వస్తుంది. తనకు తెలుగు సరిగ్గా తెలియకపోవడమో.. లేదా కంటెంట్ కోసం కావాలని ఇలా చేస్తుందో తెలియదు కానీ ఏదో చేయాలని అనుకుంటుంది. చివరికి తానే బిస్కెట్ అయ్యేలా తనపై తానే పంచులు వేయించుకుంటుంది. తాజాగా ఢీ షో లో కూడా అదే జరిగింది. దీపికా బాడీ పై హైపర్ ఆది కామెంట్ చేసిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. తాజాగా రిలీజ్ అయిన ఢీ ప్రోమోలో సీరియల్ యాక్టర్ అన్షు రెడ్డి డాన్స్ పెర్ఫార్మెన్స్ పై దీపిక కామెంట్ చేస్తుంది.. కెమెరామెన్ ను స్టేజ్ పైకి జడ్జిలు పిలుస్తారు. అతనితో దీపిక డాన్స్ చేస్తుంది. వెంటనే హైపర్ ఆది లేచి నేను డైరెక్టర్గా వీళ్ళిద్దరితో గుండు అంకుల్ బండ ఆంటీ అని సినిమా తీస్తాను అంటూ అంటాడు. ఆ మాట అనగానే అక్కడ వాళ్ళందరూ ఒక్కసారిగా నవ్వేస్తారు. దీపికా మొహం మాత్రం మార్చుకుంటుంది. ఒక సెలబ్రిటీని డైరెక్టుగా ఇలా తిట్టడం ఏంటి అని ఈ ప్రోమో ని చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హైపర్ ఆదికి ఈ మధ్య ఇలాంటివి కొత్తవి కాదు అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.. మరి దీనిపై హైపర్ ఆది ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..
Also Read : ‘గుండెనిండా గుడి గంటలు ‘ సత్యం క్యూట్ ఫ్యామిలీ.. బాగా సౌండే..
నెక్స్ట్ ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.. ఈ ప్రోమోలో ప్రభుదేవా స్పెషల్ అంటూ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చింది.. ఆ తర్వాత ఒక్కొక్కరు తమ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో మెస్మరైజ్ చేస్తారు. జై చిరంజీవ మూవీలోని ‘మహా ముద్దొచ్చేస్తున్నావోయ్ సాంగ్‌కి డ్యాన్స్ చేసింది అన్షు రెడ్డి.. ఆ మూవీలో ఎలాగైతే చేస్తారో అలానే ఇక్కడ కెమెరాను మార్చి చూపించారు. ఆ క్రెడిట్ మొత్తం కెమెరా మ్యాన్ శివ దే అంటుంది. దాంతో అందరు కూడా ఆయన పొగిడేస్తారు. దీపిక అతనితో డ్యాన్స్ చేస్తుంది. అప్పుడే ఆది దీపికా పై కామెంట్స్ చేస్తారు. మొత్తానికి అందరు తమ డ్యాన్స్ తో అదరగొట్టేసారు. ప్రోమో అయితే అదిరిపోయింది. ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..