OTT Movie : ఓటీటీలో డిఫరెంట్ సినిమాలను కోసం చాలా మంది సర్చ్ చేస్తుంటారు. వీటిలో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ సినిమాలను, ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. ఇవి ఒక మంచి ఫీలింగ్ ని కూడా ఇస్తాయి. ఒక హాలీవుడ్ హార్ట్ టచ్ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమా 2001 సెప్టెంబర్ 11లో వరల్డ్ ట్రేడ్ బిల్డింగ్స్ కూలిపోయే టైమ్ లో జరుగుతుంది. ఇందులో ఒక అమ్మాయి తన సిస్టర్ చావుకి కారణం అవుతుంది. ఇక కథ ఎమోషనల్ గా నడుస్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘డియర్ జో’ (Dear Zoe) గ్రెన్ వెల్స్ డైరెక్ట్ చేసిన అమెరికన్ డ్రామా మూవీ. ఇందులో సేడీ సింక్ (టెస్), థియో రాసీ (జిమ్మీ), జెసికా క్యాప్‌షా (ఎల్లీ), జస్టిన్ బార్తా (డేవిడ్) నటించారు. 94 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, 2022 నవంబర్ 4 థియేటర్లలో రిలీజ్ అయింది. Amazon Prime Video, netflix లో ఈ మూవీ అందుబాటులో ఉంది. దీనికి ఐయండిబిలో 6 /10 రేటింగ్ ఉంది.
టెస్ అనే 17 ఏళ్ల అమ్మాయి, తన అమ్మ ఎల్లీ, సవతి తండ్రి డేవిడ్, సోదరి ఎమ్ తో పెన్సిల్వేనియాలో ఉంటుంది. ఆమె సొంత తండ్రి తండ్రి నిక్ వేరే ఊరిలో జెర్మన్ షెపర్డ్ డాగ్స్ బ్రీడర్‌గా ఉంటాడు. అయితే 2001 సెప్టెంబర్ 11 అమెరికాలో దాడులు జరిగి, వరల్డ్ ట్రేడ్ బిల్డింగ్స్ కూలిపోతుంటాయి. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూస్తూ, టెస్ తన 3 ఏళ్ల సోదరి జోను జోను ఒంటరిగా వదిలేస్తుంది. దీంతో జో యాక్సిడెంట్‌లో చనిపోతుంది. ఈ ఘటన టెస్ కుటుంబాన్ని షాక్‌లో పడేస్తుంది. టెస్ తన సోదరి మరణానికి తానే కారణమని గిల్ట్ తో బాధపడుతుంది. ఎల్లీ డిప్రెషన్‌లో పడిపోతుంది, డేవిడ్ చిన్న కూతురు ఎమ్‌ను మాత్రమే చూసుకుంటాడు. టెస్ ఇంట్లో ఒంటరిగా ఫీల్ అవుతూ, జో ని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటుంది.
Read Also : అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఆ పాడు పని… పోలీసులకు చెమటలు పట్టించే మాస్క్ మ్యాన్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
జో మరణం తర్వాత ఒక సంవత్సరం గడిచినా, టెస్ ఇంకా గిల్ట్‌తో బాధపడుతుంది. ఆమె ఆ ఇంటి వాతావరణం భరించలేక, తన అసలు తండ్రి నిక్‌తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంది. నిక్ ఒక లవబుల్ పర్సన్. అతను టెస్‌కు అండగా ఉంటాడు. నిక్ ఇంట్లో, టెస్ జిమ్మీ అనే టీనేజ్ అబ్బాయిని కలుస్తుంది. అతనికి కూడా తన ఫాదర్, స్టెప్ మదర్‌తో సమస్యలు ఉన్నాయి. టెస్, జిమ్మీ మధ్య ఫ్రెండ్‌షిప్ మొదలవుతుంది. వాళ్లు కలిసి టైమ్ స్పెండ్ చేస్తుంటారు. ఆమెకు జీవితంలో ఇది కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ సమయంలో టెస్ తన తన అమ్మ ఎల్లీ, సవతి తండ్రి డేవిడ్, చిన్న సోదరి ఎమ్ ని మళ్లీ కలుస్తుంది. వాళ్ళతో సంబంధం మెరుగుపరుచుకుంటుంది. ఈ సినిమా ఒక ఫీల్ గుడ్ మూమెంట్ తో ముగుస్తుంది.