Delimitation Formula: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సమీపిస్తున్న వేళ, దేశ రాజకీయాల్లో ‘డీలిమిటేషన్’ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గతంలో జనాభా ప్రాతిపదికన మాత్రమే లోక్‌సభ సీట్లను పెంచాలని భావించడంతో, జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతామని వ్యతిరేకించాయి. అయితే ఈసారి మోడీ ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
జనాభాతో సంబంధం లేకుండా.. కొత్త ఫార్ములా?
కేవలం జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకోకుండా.. ఒక భిన్నమైన ఫార్ములాను తెరపైకి తెచ్చేందుకు ఎన్డీఏ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలకు అదనంగా అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం సీట్లు పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన గనుక నిజమైతే, దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్య పెరగడమే తప్ప తగ్గదు. దీనివల్ల సౌత్ స్టేట్స్ నుంచి పెద్దగా వ్యతిరేకత ఉండకపోవచ్చని కేంద్రం భావిస్తోంది.
‘ఇండీ’ విభేదాలపై కేంద్రం కన్ను
ఈ కీలకమైన బిల్లును పార్లమెంట్‌లో గట్టెక్కించేందుకు మోడీ సర్కార్ ప్రతిపక్ష ‘ఇండియా’ (I.N.D.I.A) కూటమిలోని అంతర్గత విభేదాలను ఆయుధంగా మలచుకోవాలని చూస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) లోని కొందరు సభ్యుల మద్దతు కూడగట్టడం, శివసేన (UBT), ఎన్సీపీ (NCP) లలోని తాజా రాజకీయ సమీకరణాలను అనుకూలంగా మార్చుకోవడం వంటి వ్యూహాలపై ఫోకస్ పెట్టింది. అలాగే కొన్ని అంశాల్లో కాంగ్రెస్‌తో డీఎంకే (DMK) గ్యాప్ మెయింటెయిన్ చేస్తుండటాన్ని కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తోంది.
Also Read: అంతరిక్షంలోకి హైదరాబాద్ రాకెట్ ‘విక్రమ్ 1’ – దీని ప్రత్యేకతలు ఇవే!
తెరపైకి వస్తున్న సవాళ్లు
కేంద్రం కొత్త ఫార్ములా తెచ్చినా దక్షిణాది అంత సులభంగా ఒప్పుకుంటుందా? అనేది పెద్ద ప్రశ్న. సీట్లు పెరిగినా, ఉత్తరాదితో పోలిస్తే రాజకీయంగా తమ ప్రాధాన్యత తగ్గుతుందనే భయం ప్రాంతీయ పార్టీల్లో ఇంకా ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా, ఇలాంటి రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ కావాలంటే పార్లమెంట్‌లో 2/3 వంతు మెజార్టీ అవసరం. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలంతో ఎన్డీఏ ఈ మార్కును ఎలా దాటుతుంది? ప్రతిపక్షాలను ఎలా మేనేజ్ చేస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ సవాళ్లకు మోడీ ప్రభుత్వం ఎలాంటి సమాధానం వెతుకుతుందో వేచి చూడాలి.
Also Read: రాజకీయ రంగు పులుముకుంటున్న కేసులు.. ఏపీలో ఏమిటీ ఈ పరిస్థితి?