E-Paper
Advertisement

Naagzilla OTT : షూటింగ్ పూర్తి చేసుకున్న కార్తీక్ ఆర్యన్ కామెడీ థ్రిల్లర్… థియేటర్ రిలీజ్ డేట్ ఫిక్స్… ఓటీటీలోకి అప్పుడే

Naagzilla OTT : షూటింగ్ పూర్తి చేసుకున్న కార్తీక్ ఆర్యన్ కామెడీ థ్రిల్లర్… థియేటర్ రిలీజ్ డేట్ ఫిక్స్… ఓటీటీలోకి అప్పుడే
Advertisement

Naagzilla OTT : కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ వస్తోంది. ఇది మనకు తెలిసిన ఇచ్ఛాధారి నాగుల చుట్టూ తిరిగే కథ. రూపం మార్చే నాగులతో వస్తున్న ఈ సినిమా, కొన్ని రోజుల ముందే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది చిత్ర యూనిట్. ఈ పాతకాలపు కథను, ఇప్పుడున్న టెక్నాలజీతో తీస్తుండటంతో సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ తోనే ఈ సినిమా ఆడియన్స్ ను అలరించబోతోంది. ఈ సినిమా థియేటర్ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాదు ఓటీటీతో కూడా ఈ సినిమాకు డీల్ సెట్ అయిపోయింది. మరి ఇది ఎప్పుడు థియేటర్లలో రిలీజ్ కాబోతోంది ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలను తెలుసుకుందాం.

థియేటర్లలో విడుదల ఎప్పుడంటే

ఈ హిందీ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ పేరు ‘నాగ్జిల్లా’ (Naagzilla). ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా నటిస్తుండగా, దక్షిణాది చిత్రసీమలో గుర్తింపు పొందిన ప్రీతి ముఖూందన్ కథానాయికగా బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోంది. ఇక ప్రముఖ నటుడు రవి కిషన్ విలన్ పాత్రను పోషించారు. మృగ్‌దీప్ సింగ్ లాంబా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2026 ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. ధర్మ ప్రొడక్షన్స్ (కరణ్ జోహార్) ఈ సినిమాను పాన్ ఇండియాగా రిలీజ్ చేయనున్నారు. దీంతో తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యే అవకాశం ఉంది ఈ సినిమా. ఇక థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ సినిమా Amazon Prime Videoలో ప్రసారం కానుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ అంతా పాత కాలపు ఇచ్ఛాధారి నాగుల చుట్టూ తిరుగుతుంది. అంటే రూపం మార్చుకునే పాములన్నమాట. ఎప్పుడో పురాణాల కాలం నాటి నాగలోకం రహస్యాలు, అక్కడ ఉండే శక్తుల గురించి ఈ సినిమాలో చూపిస్తారు. హీరో కార్తీక్ ఆర్యన్ చూడటానికి మామూలోడిలాగే ఉన్నా, అతని వెనుక ఒక పెద్ద పాము ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇక సినిమాలో విలన్ల విషయానికొస్తే.. నాగలోకంలో ఉండే అపారమైన శక్తులను, అక్కడ ఉండే విలువైన నాగమణిని కొట్టేయాలని చూసే గ్యాంగులతో హీరో తలపడతాడు. హీరో తనలోని పాము శక్తులను వాడుకుంటూ, శత్రువులను ఎలా చితక్కొట్టాడు అనేది మెయిన్ పాయింట్. అంటే ఇది కేవలం భక్తి సినిమా లాగా కాకుండా, ఫుల్ యాక్షన్, గ్రాఫిక్స్ తో పాటు కొంచెం కామెడీ కలిపిన మసాలా సినిమా అన్నమాట. ఇందులో పాము సైజు మామూలుగా ఉండదు. ఆ భారీ పాము చేసే హంగామా, అడవుల్లోనూ, ఊర్లలోనూ అది సృష్టించే విధ్వంసం వెండితెర మీద చూస్తే మతిపోవాల్సిందే.

Read Also :  కసిగా నెత్తురు చిందించే సైకో పాప… క్షణ క్షణం ఉత్కంఠ… గుండె గట్టిగా ఉంటేనే చూడండి

Related News

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×