E-Paper
Advertisement

Food Safety Crisis: వరుసగా వెలుగు చూస్తున్న కల్తీ ఆహారపదార్థాలు.. మామూళ్ల మత్తులో జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు?

Food Safety Crisis: వరుసగా వెలుగు చూస్తున్న కల్తీ ఆహారపదార్థాలు.. మామూళ్ల మత్తులో జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు?
Advertisement

Food Safety Crisis:  కోర్ అర్బన్ రీజియన్ లో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బయట ఫుడ్ కు అలవాటు పడిన వారు ఇక జాగ్రత్త వహించాల్సిందే. లేదంటే మీ అంతట మీరు అనారోగ్యాన్ని కోరి తెచ్చుకున్నట్టే. ప్రస్తుతం కోర్ అర్బన్ రీజియన్ పరిధి ప్రస్తుతం 2 వేల 50 కిలోమీటర్లకు విస్తరించి ఉన్నందున పౌర సేవల నిర్వహణ, పరిపాలన సౌలభ్యం కోసం జీహెచ్ఎంసీ పాత పరిధిని జీహెచ్ఎంసీ సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించిన సంగతి తెల్సిందే. జీహెచ్ఎంసీ పరిధి ఎప్పటికడపు పెరుగుతున్నా, పరిపాలన సౌలభ్యం కోసం ఎన్ని సంస్కరణలు తీసుకువస్తున్నా, క్యూర్ సిటీలో కల్తీ ఆహార విక్రయాలకు బ్రేక్ పడటం లేదు. ఇటీవలి కాలంలో దూల్ పేటలో ఏకంగా 300 కిలోల కుళ్లిన మాంసం, ఆ తర్వాత కల్తీ పన్నీురు కల్తీ వెల్లుల్లితో పాటు కెమికల్ రంగులో ఐస్ క్రీమ్ లను కూడా తయారు చేస్తూ వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు అధికారులు దాడుల్లో బయట పడుతున్నా, ఫుడ్ సేఫ్టీని పకడ్బందీగా అమలు చేయటంలో క్యూర్ సిటీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఘోరంగా విఫలమవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కుళ్లిన ఉల్లి, కూరగాయలతో సమోసాలు తయారు.

సిటీలో కల్తీ ఆహార పదార్థాల విక్రయాలు 

చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు శనివారం రట్టు చేశారు. వాస్తవానికి కూడా క్యూర్ సిటీలో కల్తీ ఆహార పదార్థాల విక్రయాలను నియంత్రించే బాధ్యత ఫుడ్ సేఫ్టీ అధికారులదే అయినా, మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు మామూళ్ల మత్తులో నిద్రపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మధ్య కల్తీ ఆహారాన్ని తయారు చేస్తున్న విక్రయిస్తున్న సంస్థలపై పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకుంటుండగా, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారు. 2023 చివరి నుంచి 2024 మధ్య కాలం వరకు అప్పటి స్టేట్ ఫుడ్ కమిషనర్ గా ఆర్.వి. కర్ణన్ విధులు నిర్వహించిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ ఆహార పదార్థాలపై తరుచూ దాడులు నిర్వహించే వారు. కెమికల్స్, కాలం చెల్లించిన, అపరి శుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని తయారు చేస్తున్న సంస్థలను గుర్తించి, వాటిలో కొన్నింటిని సీజ్ కూడా చేశారు. కానీ ఆర్.వి. కర్ణన్ జీహెచ్ఎంసీ కమిషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మూడు కార్పొరేషన్ల మాట అలా ఉంచితే, కనీసం జీహెచ్ఎంసీ పరిధిలోనైనా ఫుడ్ సేఫ్టీ యాక్టు సక్రమంగా అమలు కాకపోవటం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Also Read: Gaddar Film 2025 Awards: గద్దర్ ఫిలిం అవార్డ్స్.. శ్రేయ ఘోషల్..సుమ కనకాల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

మొక్కుబడిగా చర్యలు, చట్టంలో సవాలక్ష లొసుగులు

మహానగరంలో కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తున్న వ్యాపార సంస్థలపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారులకు చట్టంలోని లొసుగులు, స్వప్రయోజనాలు అడ్డొస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆహార విక్రయ కేంద్రాలు ఆహార తయారీలో ఎలాంటి కెమికల్స్ వాడినా, కాలం చెల్లిన వస్తువులు వినియోగించినా, కుళ్లిన మటన్, చికెన్ ను నిల్వ చేసిన ఫుడ్ సేఫ్టీ యాక్టు ప్రకారం సదరు వ్యాపార సంస్థకు నోటీసు ఇచ్చి సీజ్ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే కేసు నమోదు చేసి జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాలని నిబంధనలు చెబుతున్నా, అధికారులు మాత్రం ఈ ప్రక్రియ మొత్తాన్ని ఏ ఒక్క కేసులో అమలు చేయటం లేదన్న విషయం తేలిపోయింది. ఆహార విక్రయ కేంద్రాలైన హోటళ్లు, మెస్ లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లతో పాటు స్వీట్ హౌజ్ లు, బేకరీలు వంటి వాటిపై దాడులు నిర్వహించి, ఫుడ్ శ్యాంపిల్స్ సేకరించి, పరీక్షల నిమిత్తం హబ్సిగూడలోని నేషనల్ ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రీషియన్ (ఎన్ఐఎన్ )కు పంపుతున్నారు. తొలుత వ్యాపార సంస్థను సీజ్ చేస్తున్నారు. శాంపిల్స్ టెస్టు నివేదికలు వచ్చేందుకు నెలల సమయం పడుతున్నందున, వ్యాపారులు రాజకీయంగా పైరవీలు చేసుకుని, ఫుడ్ సేఫ్టీ అధికారులను మేనేజ్ చేసుకుని తమ వ్యాపార సంస్థను ఒక్క అఫిడెవిట్ తో మళ్లీ రీ ఓపెన్ చేసుకుంటున్నారు. ఇంకేముందీ మళ్లీ అంత షరామామూలుగానే మారుతుంది.

ఫుడ్ సేఫ్టీ వింగ్ ఏం చేస్తున్నట్టో?

Advertisement

జీహెచ్ఎంసీ పరిధిలో సర్కిల్ కు ఒకరు చొప్పున ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను, వారి పనితీరు పర్యవేక్షణకు ఫుడ్ డిజిగ్నేటెడ్ ఆఫీసర్లను కూడా నియమించారు. కరోనాకు ముందే సర్కిల్ కు ఒకరు చొప్పున 30 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను నియమించారు. కానీ వివిధ కారణాలతో జీహెచ్ఎంసీకి కేవలం 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు రిపోర్టు చేశారు. వీరిలో ఇద్దరు మానుకోగా, మరోకరు కోర్టును ఆశ్రయించటంతో ఈ సంఖ్య కాస్త 21కి తగ్గింది. వీరిలో ఇద్దరు ఉన్నతాధికారులకు ఎలాంటి ముందస్తు సమాచారమివ్వకుండా సెలవుల్లో వెళ్లటంతో వారిని కూడా జీహెచ్ఎంసీ నుంచి తప్పించటంతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల సంఖ్య 19 కు పడిపోయింది. వీరంతా ఎవరి అండర్ లో పని చేస్తున్నారు? వీరంత ఎక్కడెక్కడున్నారు? వీరి డైలీ డ్యూటీ చార్జ్ ఏమిటీ అన్నది ఎవరికీ అంతు చిక్కకుండా ఉంది.

కమిషన్ ప్రాతిపదికన వసూళ్ల దందా

ప్రస్తుతం జీహెచ్ఎంసీలో అందుబాటులో ఉన్న 19 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఇదే వింగ్ లో విధులు నిర్వహించి, రిటైర్డు అయిన అధికారి అండర్ లోనే విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరి నియామకం సమయంలో ప్రస్తుత రిటర్డు ఆఫీసర్ వీరికి వసూళ్ల చిట్కాలు నేర్పటంతో పాటు ఇప్పటికీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను వీరికి లింకు చేస్తూ, నెలసరి మామూళ్లను ఫిక్స్ చేసుకుని, తనకు రావాల్సిన కమిషన్ ను తన ఫోన్ కు జీ పే, ఫోన్ పే చేయించుకుంటున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. కోర్ అర్బన్ రీజియన్ లోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లంతా మూడు కార్పొరేషన్ల కమిషనర్ పర్యవేక్షణలో కాకుండా రిటైర్డు ఆఫీసర్ ఆధీనంలో విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 19 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న 30 సర్కిళ్లలోని చిన్నా చితక టీ హోటల్ మొదలుకుని బిర్యానీ హోటళ్లు, త్రి స్టార్, ఫైవ్ స్టార్ హోటల్లతో ఇప్పటికే నెలసరి మామూళ్లు సదరు అధికారే ఫిక్స్ చేయించినందునే, హోటళ్లు, మెస్ లు, బిర్యానీ హోటళ్లపై గతంలో తరహాలో ప్రస్తుతం దాడులు జరగటం లేదని కొందరు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లే బాహాటంగానే చెబుతున్నారు.

Also Read: V.V.Vinayak: పొలిటికల్ ఎంట్రీపై డైరెక్టర్ వినాయక్ కామెంట్.. ఒకవేళ వస్తే ఆ పార్టీలోనే!

Related News

తెలంగాణ గ్రామ పంచాయతీలకు.. సీక్రేట్ ఆర్డర్స్ జారీ చేసిన సర్కార్..?

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

Big Stories

Advertisement
×