E-Paper
Advertisement

SSB Recruitment: కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. టెన్త్ పాసైతే చాలు

SSB Recruitment: కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. టెన్త్ పాసైతే చాలు

భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సశస్త్ర సీమా బల్ (SSB) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-సి నాన్-గెజిటెడ్ కేటగిరీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కమ్యూనికేషన్, ఎలక్ట్రీషియన్, వెటర్నరీ, స్టీవార్డ్ విభాగాల్లో మొత్తం 233 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. దేశ రక్షణ రంగంలో స్థిరపడాలనుకునే యువతకు ఇది మంచి అవకాశం.

వెకెన్సీ వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా అత్యధికంగా కమ్యూనికేషన్ విభాగంలో 197 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రీషియన్ విభాగంలో 29 ఉద్యోగాలు ఉన్నాయి. వెటర్నరీ విభాగంలో 05 పోస్టులు అలాగే స్టీవార్డ్ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. పారా మిలిటరీ బలగాల్లో చేరాలనుకునే అభ్యర్థులు తమ అర్హతలను బట్టి వీటిని ఎంచుకోవచ్చు.

విద్యార్హత:

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు నిర్ణయించారు. హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ పోస్టుకు సైన్స్ లేదా పీసీఎం సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. ఎలక్ట్రీషియన్ పోస్టుకు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ తప్పనిసరి. వెటర్నరీ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా కలిగి ఉండాలి. స్టీవార్డ్ పోస్టుకు క్యాటరింగ్ డిప్లొమా లేదా పని అనుభవం అడిగారు.

వయస్సు: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎలక్ట్రీషియన్ పోస్టుకు మాత్రం గరిష్ట వయస్సు 25 ఏళ్లుగా నిర్ణయించారు. రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

సెలెక్షన్ ప్రాసెస్:

అభ్యర్థులను వివిధ దశల పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. మొదట ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET) తో పాటు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారికి రాత పరీక్ష ఉంటుంది. అనంతరం నైపుణ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

జీతం: ఎంపికైన వారికి నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు వేతనం లభిస్తుంది. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు కూడా అందుతాయి.

దరఖాస్తు ప్రక్రియ:

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు 100 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు అలాగే మాజీ సైనికోద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ (21.03.2026) నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://ssb.gov.in

ALSO READ: Xiaomi SU7 2026: ఒకే ఛార్జ్ తో 902 కి.మీ రేంజ్, వామ్మో ఇదేం టెక్నాలజీ భయ్యా!

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×