E-Paper
Advertisement

పేర్లు తెలిస్తే చాలు చంపే టాలెంట్… స్పైన్ చిల్లింగ్ కొరియన్ హర్రర్ సిరీస్

పేర్లు తెలిస్తే చాలు చంపే టాలెంట్… స్పైన్ చిల్లింగ్ కొరియన్ హర్రర్ సిరీస్
Advertisement

Korean Horror Thriller: హారర్ అంటే చాలామందికి ముందుగా దెయ్యాలు, జంప్ స్కేర్స్ గుర్తొస్తాయి. కానీ కొన్ని కథలు మాత్రం భయపెట్టడమే కాదు… మనసులో విచిత్రమైన భయాన్ని కూడా మిగులుస్తాయి. అలాంటి సౌత్ కొరియన్ మిస్టరీ హారర్ సిరీస్‌లలో ముందుగా చెప్పుకోవాల్సింది ‘ది కర్స్‌డ్’ (The Cursed) సిరీస్ గురించి. ఇదేదో రొటీన్ దెయ్యాల కథ కాదు. క్షుద్రపూజలు, చేతబడి, శాపాలు, కార్పొరేట్ కుట్రలు… ఇలా పూర్తిగా ఒక కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్తుంది. మరి ఆ ప్రపంచంలోకి మనం కూడా వెళ్ళాలి అనుకుంటే… అంతకన్నా ముందు సిరీస్ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఇమ్ జిన్-హీ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ తో కథ మొదలవుతుంది. ఒక ప్రముఖ ఐటీ కంపెనీ ఫారెస్ట్ వెనుక జరుగుతున్న అనుమానాస్పద వ్యవహారాలపై ఆమె దర్యాప్తు ప్రారంభిస్తుంది. నిజానికి అదొక సక్సెస్ ఫుల్ సంస్థ. కానీ ఆ ముసుగు వెనుక దాగి ఉన్న నిజం మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. కంపెనీ ఛైర్మన్ జిన్ జోంగ్-హ్యున్ అందరిలాగా నార్మల్ వ్యాపారవేత్త కాదు.

Advertisement

క్షుద్రపూజలు, శ్యామనిజాన్ని నమ్ముతూ దుష్టశక్తుల సహాయంతో తన అధికారాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అతని చుట్టూ జరిగే వింత సంఘటనలు జర్నలిస్ట్ అనుమానాలను మరింత పెంచుతాయి. ఇన్వెస్టిగేషన్ ఇలా కొనసాగుతుండగా, జిన్-హీకి బేక్ సో-జిన్ అనే టీనేజ్ అమ్మాయి పరిచయమవుతుంది. చూస్తే చిన్న పిల్లలాగా, విద్యార్థిలా కనిపించే ఆమెకు ఊహించని శక్తి ఉంటుంది.

ఒక వ్యక్తి ఫోటో, అతని పేరు, అతనికి సంబంధించిన ఒక వస్తువు… ఇలాఏం దొరికినా సరే సో-జిన్ క్షుద్రశక్తితో ఆ వ్యక్తిపై శాపం పెట్టగలదు. ఈ శక్తి ఎలా వచ్చింది ? ఎందుకు వచ్చింది ? అనే ప్రశ్నలకు సమాధానం ముందుముందు తెలుస్తుంది. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త కొత్త రహస్యాలు బయట పడుతుంటాయి. కథలో వచ్చే ట్విస్టులతో సిరీస్ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ దుష్టశక్తి ఎంత బలమైనది ? దాన్ని ఎలా ఆపాలి ? అసలు జోంగ్-హ్యున్ వెనుక ఉన్న దుష్టశక్తి ఏమిటి ? సో-జిన్ తన శాపశక్తితో ఆ చీకటి ప్రపంచాన్ని ఆపగలిగిందా ? అన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్‌పై వీకెండ్ ఒక లుక్కేయండి.

ఏ ఓటీటీలో చూడవచ్చు ?

Advertisement

‘ది కర్స్‌డ్’ను డైరెక్టర్ కిమ్ యాంగ్-వాన్ హారర్‌తో పాటు మిస్టరీని కూడా మిక్స్ చేసి కొట్టారు. Train to Busan కథతో గుర్తింపు పొందిన యోన్ సాంగ్-హో ఈ సిరీస్‌కు కథ అందించడం కూడా మరో విశేషం. ప్రతి ఎపిసోడ్‌లో ఉత్కంఠ పెరుగుతూనే ఉంటుంది. మొదటి ఎపిసోడ్ నుంచే ఏదో తెలియని ప్రమాదం దగ్గరపడుతున్న భావన కలుగుతుంది. ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే సిరీస్ ను చివరి వరకు వదిలి పెట్టకుండా చేస్తుంది. ఈ సిరీస్ Netflix, Amazon Prime Video రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. MX Playerలో ఈ కొరియన్ సిరీస్ హిందీ డబ్బింగ్ వెర్షన్ ఉచితంగా అందుబాటులో ఉంది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో లేదు.

Read Also: బ్యాచిలర్ పార్టీకని వెళ్ళి దిక్కుతోచని చిక్కుల్లో… కట్ చేస్తే బట్టల్లేకుండా బీచ్ లో

Tags

Related News

10 రోజుల్లో పట్టుకోవాలని సీరియల్ కిల్లర్ ఛాలెంజ్… ప్రాసిక్యూటర్ కు మెంటలెక్కించే సైకో

సముద్రం అడుగున గుట్టలుగుట్టలుగా బంగారం… హై-వోల్టేజ్ యాక్షన్ తో దుమ్మురేపే డిజాస్టర్ థ్రిల్లర్

ఒక్క అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిలు… తెలుగులోనే ట్రయాంగిల్ వెబ్ సిరీస్

బాత్రూమ్ లో మందుతో తల్లి మృతి… అనుమానమంతా తండ్రిపైనే… నిమిషానికో ట్విస్ట్ మావా

పోలీస్ అధికారి రాసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీలో అంటే?

ప్రాణంగా చూసుకున్న పాపనే చంపి ఫ్రిడ్జ్ లో… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ సిరీస్

దురదృష్టవంతుడి చేతిలో విశ్వవినాశనాన్ని ఆపే బాధ్యత… మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×