Jurala Inflow: మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని కృష్ణా ప్రాజెక్టులైన ఆలమట్టికి 84,888 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆల్మట్టి నుంచి దిగువకు 67,500 క్యూసెక్కుల వరద ప్రవాహం నారాయణపూర్ డ్యాంకు వస్తున్న క్రమంలో నారాయణపూర్ ప్రాజెక్టు 8 గేట్లు తెరిచి దిగువనున్న జూరాల వైపు 24,560 క్యూసెక్కులు వరద నీటిని నదిలోకి వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 33.313 టీఎంసీలు కాగా ప్రస్తుతం 31.96 టీఎంసీల నిల్వ ఉంది. నారాయణ పూర్ డ్యాం నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఆదివారం వరద నీరు వచ్చే చేరే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.
ఈ వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీట ర్లు కాగా ప్రస్తుతం 315.91 మీటర్లుగా ఉన్నది. పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలగానూ ప్రస్తుత నీటి నిల్వ 5.042 ఉన్నది. జూరాలలో పూర్తి స్థాయిలో నీటిమట్టం లేకపోవడంతో జూరాల ఆయకట్టు మీద ఆదారపడిన నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కుడి, ఎడమ, సమాంతర కాలువలకు సాగు నీటి విడుదలలో జాప్యం ఉండవచ్చని, ఇక ముందు కూడా వర్షాలు కురిసే అవకాశం సన్నగిల్లడంతో సాగుకు నీటి విడుదల చేయకపోవచ్చని సమాచారం.
Also read: ఆయిల్ ఫెడ్ ఆఫీస్‌లో.. ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి తుమ్మల బిగ్ షాక్!
ఎగువ ప్రాంతాల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ఆల్మట్టి అధికారులు డ్యామ్ గేట్ల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్న నీటిని ఈ మేరకు తగ్గించారు.ఇప్పటివరకు కొనసాగుతున్న 67,500 క్యూసెక్కుల ఔట్ ఫ్లో 35 వేల క్యూసెక్కులకు తగ్గించారు.ప్రాజెక్టు స్పిల్ వే క్రస్ట్ గేట్లను మూసి వేశారు. కేవలం ఆల్మట్టి పవర్ హౌస్ ద్వారా వచ్చే నీటిని మాత్రమే వదులుతున్నారు.
Also read: నెక్లెస్ రోడ్‌లో సీఎం రేవంత్ రెడ్డి కొవ్వొత్తుల ర్యాలీ..!