E-Paper
Advertisement

మన్మోహన్ సింగ్ కాలాన్ని గుర్తు చేస్తూ.. కేంద్రానికి కోమటిరెడ్డి ఘాటు కౌంటర్!

మన్మోహన్ సింగ్ కాలాన్ని గుర్తు చేస్తూ.. కేంద్రానికి కోమటిరెడ్డి ఘాటు కౌంటర్!
Advertisement

Komatireddy: నీట్ పరీక్షా పత్రాల లీకేజీల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లక్షలాది మంది యువత రాత్రింబవళ్లు కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటే.. వరుస లీకేజీల వల్ల మానసిక వేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

యూపీఏ నుంచి నేటి ఎన్డీయే పాలన వరకు ప్రశ్నాపత్రాలు లీక్ కావడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. మాటల మీద ఉన్న శ్రద్ధను పరీక్షల నిర్వహణలో చూపకపోవడం దారుణమన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడాన్ని, ప్రధాని నివాస ముట్టడికి దిగిన ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు.

గతంలో మన్మోహన్ సింగ్ హయాంలో చిన్న ఆరోపణలకే మంత్రులు రాజీనామా చేశారని గుర్తుచేశారు. ఈ లీకేజీలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, ప్రధాని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Related News

స్థానిక ఎన్నికలపై జగన్ మరో కొత్త స్కెచ్!

ఏపీ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జి.. షర్మిలకు కొత్త ట్విస్ట్?

సర్పంచ్ VS ఉప సర్పంచ్.. చెక్ పవర్ వార్..!

స్పీకర్‌పై వ్యాఖ్యలు.. రాజకీయాల్లో కొత్త వివాదం..!

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు ప్లాన్ ఇదే!

ప్రాణాలు తీస్తున్న డీజే సౌండ్స్.. కఠిన రూల్స్ రావాల్సిందేనా..?

తనిఖీ చేస్తే మిల్లింగ్ ఆపేస్తాం.. మిల్లర్లు రివర్స్ ఎటాక్..!

కంట్రోల్.. తాతా మధు!

Big Stories

Advertisement
×