E-Paper
Advertisement

పోలీస్ అధికారి లోడెడ్ గన్ మిస్సింగ్… ఈ మలయాళం మూవీలో ఒక్కో ట్విస్టు మెంటల్ మాస్

పోలీస్ అధికారి లోడెడ్ గన్ మిస్సింగ్… ఈ మలయాళం మూవీలో ఒక్కో ట్విస్టు మెంటల్ మాస్
Advertisement

Crime Thriller on OTT : ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లు చాలా ఉన్నా, హృదయాన్ని తాకేలా, సస్పెన్స్‌ తో నిండిన సినిమాలు అరుదు. అలాంటి ఒక పవర్ ఫుల్ తమిళ చిత్రం ‘8 తొట్టక్కల్’ (8 Thottakkal). శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. న్యాయం, నిజాయితీ, ప్రతీకారం మధ్య జరిగే సంఘర్షణను అద్భుతంగా చూపించిన ఈ చిత్రం ప్రేక్షకులను క్లైమాక్స్ వరకు కట్టిపడేస్తుంది.

కథలోకి వెళ్తే…

ఇందులో కథ సత్య (వెట్రి) చుట్టూ తిరుగుతుంది. అతను ఒక నిజాయితీ గల సబ్ ఇన్‌స్పెక్టర్. ఇతర పోలీసులకు భిన్నంగా ఉంటాడు. చాలామంది పోలీసుల లాగా అతను లంచాలు తీసుకోడు. పైగా న్యాయానికి కట్టుబడి ఉంటాడు. ఈ క్రమంలోనే ఒక రోజు అతని సర్వీస్ రివాల్వర్ (పిస్టల్)ను కోల్పోతాడు. ఏకంగా ఒక పోలీస్ ఆఫీసర్ తన ఒరిజినల్ గన్ ను పోగొట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆ పిస్టల్ ఒక సాధారణ వ్యక్తి మూర్తి (ఎం.ఎస్. భాస్కర్) చేతికి చేరుతుంది. మూర్తి జీవితం చాలా కష్టాలతో నిండి ఉంటుంది. అతను ఆ పిస్టల్‌తో 8 రౌండ్లు కాల్చి పలు హత్యలు చేస్తాడు.

Advertisement

ఈ హత్యల వెనుక ఉన్న కారణాలు చాలా డెప్త్ గా ఉంటాయి. సత్య తన పిస్టల్ ను కోల్పోయినందుకు చాలా ఒత్తిడికి గురవుతాడు. ఒకవైపు తన ఉద్యోగం, మరోవైపు న్యాయం కోసం పోరాడుతూ అతను కేసును దర్యాప్తు చేస్తాడు. కథలో హత్యలు జరిగిన ప్రతి సన్నివేశం వెనుక ఉన్న మానవీయ కారణాలు హార్ట్ టచింగ్ గా ఉంటాయి. ఒక సాధారణ వ్యక్తి ఎందుకు హంతకుడిగా మారాడు? నిజాయితీ ఉన్న పోలీసు ఎంత ఒత్తిడిని ఎదుర్కొంటాడు ? ఆ పోలీస్ తన గన్ ను చివరకి ఎలా దక్కించుకున్నాడు ? అన్నది ఈ సినిమా ముఖ్యాంశం.

ఈ సినిమాలో వెట్రి – సత్య అనే సబ్ ఇన్‌స్పెక్టర్ గా, ఎం.ఎస్. భాస్కర్ – మూర్తి అనే హంతకుడి పాత్రలో, అపర్ణా బాలమురళి – మీరా వాసుదేవన్ రోల్ లో, నాసర్ – పాండియన్ గా, మిమ్ గోపి – ఇన్‌స్పెక్టర్ గుణశేఖరన్ గా నటించారు. ముఖ్యంగా ఎం.ఎస్. భాస్కర్ నటన ప్రేక్షకులను కదిలిస్తుంది.

Advertisement

Also Read : జూన్ లో ఓటీటీలోకి రాబోతున్న క్రేజీ కొరియన్ డ్రామాలు… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

ఎందుకు చూడాలి?

‘8 తొట్టక్కల్’లో నిజాయితీ, అన్యాయం, సమాజంలోని వ్యవస్థలోని లోపాలు, ఒక సాధారణ మనిషి హంతకుడిగా మారడానికి ఉన్న కారణాలు అన్నీ ఆసక్తికరంగా ఉంటాయి. యాక్షన్, సస్పెన్స్, ఎమోషన్ ను బ్యాలెన్స్‌ చేసిన డైరెక్టర్ శ్రీ గణేష్ మొదటి సినిమాలోనే అద్భుతమైన స్క్రిప్ట్‌ తో తన మార్క్ చూపించారు. హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమా తమిళ్‌లో వచ్చింది. అలాగే తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

Also Read : అమ్మాయి చస్తే ఇవేం సైకో పనులు భయ్యా… 8 ఎపిసోడ్ల మెంటల్ మాస్ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

పెళ్ళయిన వ్యక్తితో రిలేషన్ లో… మెదడును కదిలించే క్లైమాక్స్

లవర్ కు మతిమరుపు వస్తే… కన్నీళ్ళు పెట్టించే తెలుగు రొమాంటిక్ డ్రామా

గర్ల్ ఫ్రెండ్ కోసం కుక్కను తెచ్చి కొత్త చిక్కుల్లో… డాగ్ లవర్స్ డోంట్ మిస్

ఒకరి తర్వాత ఒకరు సైకోలుగా మారి హత్యలు చేసే పేరున్న వ్యక్తులు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్

50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×