E-Paper
Advertisement

Year Ender 2025 : ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్… క్షణక్షణం ఉత్కంఠ… ఈ ఏడాది వచ్చిన అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ సిరీసులు ఇవే

Year Ender 2025 : ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్… క్షణక్షణం ఉత్కంఠ… ఈ ఏడాది వచ్చిన అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ సిరీసులు ఇవే
Advertisement

Year Ender 2025 : 2025 సంవత్సరానికి మరికొన్ని గంటల్లో ఎండ్ కార్డు పడబోతున్న తరుణంలో ఈ ఏడాది వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీసులపై ఒక లుక్కేద్దాం. OTT ప్లాట్‌ఫామ్‌లు మనకు ఎన్నో అద్భుతమైన సిరీస్‌లు ఇచ్చాయి. ముఖ్యంగా హిందీలో క్రైమ్ థ్రిల్లర్స్ రంగంలో చాలా బెస్ట్ షోలు వచ్చాయి. క్షణక్షణం ఉత్కంఠ, ట్విస్ట్స్, స్ట్రాంగ్ స్టోరీలైన్స్‌తో ప్రేక్షకులను స్క్రీన్‌కి అతుక్కుపోయేలా చేశాయి. ఈ సంవత్సరం క్రైమ్ జానర్‌లో అత్యధిక IMDb రేటింగ్స్ పొందిన 7 సిరీస్‌ల లిస్ట్ ఇక్కడ ఉంది. 2026 స్టార్ట్ అవ్వకముందే వీటిని వాచ్‌లిస్ట్‌లో యాడ్ చేసుకోండి.

1. పాతాళ్ లోక్ సీజన్ 2 (Paatal Lok Season 2)

జనవరి 2025లో ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన ఈ సీజన్ మళ్లీ సంచలనం సృష్టించింది. జైదీప్ అహ్లవత్ (హతీరామ్ చౌధరీగా), తిలోతమా షోమ్, ప్రశాంత్ తమంగ్ లాంటి నటులు ఇందులో నటించారు. నార్త్-ఈస్ట్ ఇండియాలో హై-ప్రొఫైల్ మర్డర్ కేస్ నేపథ్యంలో సాగే ఈ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ లో సోషల్ ఇష్యూస్ డీప్‌గా చూపించారు. IMDbలో 8.2 రేటింగ్ ఉన్న ఈ సిరీస్ ను Amazon Prime Videoలో చూడవచ్చు.

2. బ్లాక్ వారెంట్ (Black Warrant)

Advertisement

జనవరి 2025లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన రియల్ లైఫ్ ఇన్‌స్పైర్డ్ సిరీస్ ‘బ్లాక్ వారెంట్’. జహాన్ కపూర్, రాహుల్ భట్, పరమ్‌వీర్ సింగ్ చీమా ప్రధాన పాత్రల్లో నటించారు. 1980ల తీహార్ జైల్‌లో జైలర్ ఎదుర్కొనే కరప్షన్, పవర్ స్ట్రగుల్స్ ను ఇందులో రియలిస్టిక్ గా చూపించారు. ఐఎండీబీలో 7.9 రేటింగ్ ఉండగా, Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.

3. బ్లాక్, వైట్ & గ్రే (Black, White & Grey)

2025 మేలో SonyLIVలో రిలీజ్ అయిన మిస్టరీ థ్రిల్లర్ ఇది. మయూర్ మోర్, పాలక్ జైస్వాల్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఆరు ఎపిసోడ్స్‌తో వచ్చిన ఈ సిరీస్ లో క్రైమ్, మానవ స్వభావం మధ్య బ్యాలెన్స్ ను సూపర్ గా చూపించారు. ఐఎండీబీలో రేటింగ్ 8.0 ఉంది.

4. ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ (Khakee: The Bengal Chapter)

Advertisement

2025 మార్చిలో నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో వచ్చిన పొలిటికల్ క్రైమ్ డ్రామా. ఐఎండీబీలో రేటింగ్: 7.5గా ఉంది.

5. ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ (The Waking of a Nation)

మార్చి 2025లో సోనీ లివ్ లో ప్రీమియర్ అయిన హిస్టారికల్ క్రైమ్ సిరీస్ ఇది. నేషనల్ ఈవెంట్స్, పొలిటికల్ క్రైమ్ మిక్స్ చేసి చెప్పిన డీప్ స్టోరీటెల్లింగ్ బాగుంది. ఐఎండీబీలో 7.6 రేటింగ్ సంపాదించింది ఈ సిరీస్.

6. కన్నెడ (Kanneda)

జాబితాలో నాల్గవ స్థానంలో హిందీ – పంజాబీ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ “కన్నెడ” ఉంది. పర్మిష్ వర్మ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సిరీస్‌లో తొమ్మిది ఎపిసోడ్‌లు ఉన్నాయి. దీన్ని జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు. ఈ సిరీస్ కు ఐఎండీబీలో 7.7 ఉంది.

7. డబ్బా కార్టెల్ (Dabba Cartel)

షబానా అజ్మీ, జ్యోతికా లాంటి స్టార్స్‌తో వచ్చిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ ఈ సిరీస్. మిడిల్ క్లాస్ వుమెన్ డబ్బా సిస్టమ్ ద్వారా డ్రగ్ కార్టెల్ నడపడం ఏడు ఎపిసోడ్స్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఐఎండీబీలో 7.1 రేటింగ్ ఉన్న ఈ సిరీస్ ను Netflix లో చూడవచ్చు.

Read Also :  నరకం పేరు వింటేనే పారిపోయేలా చేసే హర్రర్ మూవీ… చూడాలంటే హనుమాన్ చాలీసా పక్కనుండాల్సిందే భయ్యా

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×