E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు – సన్నిహితులతో విభేదాలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు – సన్నిహితులతో విభేదాలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 30వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ధన వ్యవహారాలు కలసివస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నూతన వ్యవహారాలను ప్రారంభిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగపరంగా అధిక చర్చలు సఫలం అవుతాయి. 

వృషభం

Advertisement

రుణ ప్రయత్నాలు ఫలించవు వృధా ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆప్తులతో విభేదాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.  చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. 

మిథునం

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది.

కర్కాటకం

Advertisement

వృత్తి ఉద్యోగాలలో పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేక నష్టపడతారు. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు మానసిక సమస్యలు పెరుగుతాయి. రుణ భారం అధికమౌతుంది.

సింహం

ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ ఫలించి నూతన లాభాలు పొందుతారు. స్థిరాస్తి ఒప్పందాలు కలసి వస్తాయి. దీర్ఘకాలిక రుణాల తొలగుతాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. 

కన్య

వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున ఉన్నత కలుగుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగమున పనిభారం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఉద్యోగమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. 

ధనుస్సు

స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగముల ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి కలుగుతుంది.

మకరం

వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఆప్తుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన వస్తులాభాలు పొందుతారు.  

కుంభం

వివాదాలకు దూరంగా ఉండటం మంచిది కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభించవు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు వృధా ఖర్చులు పెరుగుతాయి. సన్నిహితులతో ధన వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి.

మీనం

వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు తప్పవు. నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×