Vaikunta Ekadashi: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు. అర్థరాత్రి తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. మొదట వీఐపీలు, ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠద్వార దర్శనాన్ని టీటీడీ ప్రారంభింంచింది. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు..10 రోజులపాటు ఈ దర్శనం కల్పిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణరథంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. బుధవారం ద్వాదశి సందర్భంగా వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. మొదటి మూడు రోజులు డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో టోకెన్లున్న భక్తులనే దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఆధార్ కార్డుతో పాటు డిప్‌లో కేటాయించిన టోకెన్ ప్రింట్‌కాపీని తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ సూచించింది.
మంగళవారం తెల్లవారుజామున ఒంటిగంట నుంచి ఉదయం 11 గంటల వరకు టైంస్లాట్ టోకెన్ పొందినవారిని కృష్ణతేజ ప్రవేశమార్గం నుంచి, ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల స్లాట్‌లో ఉన్నవారిని ఏటీజీహెచ్ నుంచి అనుమతిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు శిలాతోరణం ప్రవేశమార్గం ద్వారా భక్తులను ఆలయంలోకి పంపిస్తారు.
జనవరి 2 నుంచి 8 వరకు ఎలాంటి టోకెన్లూ లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఇప్పటికే జారీచేసిన ఎస్‌ఈడీ, శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన భక్తులను నిర్దేశిత సమయంలో ఆయా కోటా మేరకు అనుమతిస్తారు. చివరి మూడు రోజుల్లో స్థానికులకు రోజుకు 5వేల మంది చొప్పున ఇప్పటికే ఈ-డిప్ ద్వారా టోకెన్లు జారీచేశారు.
టీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు తిరుమల శ్రీవారి ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ.. అనుకున్న దాని కన్నా ముందుగానే దర్శనాలు ప్రారంభించాం. అలాగే ఎక్కడ కూడా చిన్న ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. కట్టుదిట్టమైన ఏర్పాట్లు, కనివిరిగని రీతిలో వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లను చేశాం. దీంతో భక్తులందరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. కొద్ది సేపట్లో టోకెన్లు ఉన్న భక్తులను దర్శనానికి అనుమతిస్తాం అని తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన ఆయనకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు.
Also Read: మారుమోగిన భద్రాచలం.. గోదావరిపై స్వామివారి జలవిహారం..లైవ్ వీడియో
తిరుమల శ్రీవారి సేవలో పయ్యావుల కేశవ్
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న రాష్టమంత్రి పయ్యావుల కేశవ్. దర్శనం అనంతరం వైకుంఠ ద్వార దర్శనాలకు రాష్ట్ర ప్రభుత్వం,టీటీడీ చేసిన ఏర్పాట్లు అద్భుతం అన్నారు. అలాగే ప్రముఖుల దర్శనాలను కూడా తగ్గించి సామాన్య భక్తులకు పెద్ద పీట వేశారన్నారు. అంతేకాకుండా భక్తులు మిగతా రోజులు కూడా స్వామివారి దర్శనానికి వచ్చి సద్వినియోగం చేసుకోవాలన్నారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనేక మంది ప్రముఖులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంలో పాల్గొన్నారు.మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, కుమార్తెలు సుస్మిత, శ్రీజలతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అలాగే హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి దర్శించుకున్నారు. అలాగే మంత్రి పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడుతో పాటు.. శ్రీనివాస్, సత్య కూమార్, కొల్లు రవీంద్ర,’సవిత, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. అంతేకాకుండా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి.. ఎమ్మెల్సీ భరత్, దేవినేని అవినాష్, ఇండియన్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, చాముండేశ్వరినాథ్ వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. సినీ నిర్మాత డివివి దానయ్య, బండ్ల గణేష్, హీరో నారా రోహిత్, శివాజి, హీరోయిన్ శ్రీ లీల వైకుంఠ దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసులు రెడ్డి, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఏపీ రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కూడా దర్శనం చేసుకున్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. తెల్లవారుజామున వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యులు pic.twitter.com/44Bf9qxNRo
— BIG TV Breaking News (@bigtvtelugu) December 30, 2025
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటున్న తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు pic.twitter.com/FC8XVU1XTp
— BIG TV Breaking News (@bigtvtelugu) December 30, 2025