E-Paper
Advertisement

మొగుడు పెళ్లాల మధ్యలోకి వచ్చి ముంచేశాడు… క్లైమాక్స్‌లో ఊహించని డ్రామా… తెలుగులో ఇంగ్లీష్ సిరీస్

మొగుడు పెళ్లాల మధ్యలోకి వచ్చి ముంచేశాడు… క్లైమాక్స్‌లో ఊహించని డ్రామా… తెలుగులో ఇంగ్లీష్ సిరీస్
Advertisement

Colombian Comedy Drama Series: పెళ్లయి ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. అయితే భార్య జీవితంలోకి మరో వ్యక్తి రావడంతో ఆ ఇంట్లో  ఊహించని రచ్చ జరుగుతుంది. అలాంటి కంటెంట్ తో ఓ కామెడీ సిరీస్  ఓటీటీలో ఆకట్టుకుంటోంది. ప్రేమ, పెళ్లి, కుటుంబ గొడవలు, కామెడీ, ఎమోషన్స్ అన్నీ కలిపిన పాపులర్ సిరీస్ ‘Betty La Fea: The Story Continues’ సీజన్ 3 ఇప్పుడు Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ డ్రామా, భార్యాభర్తల మధ్య సమస్యలు, పాత ప్రేమ మళ్లీ రావడం, బిజినెస్ గొడవలు, కామెడీతో కూడిన కథలు ఇష్టపడేవారికి ఈ సిరీస్ వీకెండ్ బింజ్.

కథలోకి వెళ్తే…

కథ చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ బెట్రీ, డాన్ ఆర్మాండో జీవితంలోకి తీసుకెళ్తుంది. వీరిద్దరూ ఇప్పుడు టీనేజ్ కుమార్తెకు తల్లిదండ్రులు. ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఉన్న ఈ దంపతుల మధ్య మాత్రం పరిస్థితులు అంత సాఫీగా ఉండవు. బెట్రీ తన జీవితాన్ని, కెరీర్‌ను, తనకంటూ ఉన్న కలలను కొత్తగా ఆలోచించుకోవడం మొదలుపెడుతుంది. మరోవైపు ఆర్మాండో మాత్రం బెట్రీని తిరిగి తన దగ్గరకు తీసుకురావాలని ప్రయత్నిస్తుంటాడు.

Advertisement

ఇంతలో బెట్రీ జీవితంలోకి ఆమె పాత పరిచయం అయిన మిషెల్ మళ్లీ వస్తాడు. బెట్రీ అతనితో సన్నిహితంగా మారుతుండటం ఆర్మాండోలో అసూయ పెరుగుతుంది. ఇద్దరి మధ్య పాత ప్రేమ మళ్లీ మంటలు రేపుతుంటే, ఎకోమోడా బిజినెస్ కూడా మరో పెద్ద సమస్యలో చిక్కుకుంటుంది. కంపెనీని కొనుగోలు చేయడానికి వచ్చే ఆఫర్, దాని వెనుక ఉన్న కుట్రలు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.

అంతేకాదు, బెట్రీ తన అధ్యక్ష పదవిని వదిలి రచయితగా తన కలను కొనసాగించాలని అనుకోవడం మరో మలుపు. ఆ సమయంలో మిలా, రోమాన్ సంబంధం, ఎకోమోడాను కాపాడేందుకు రోమాన్ చేసే ప్రయత్నాలు, ఏంజెల్‌కు సంబంధించిన మోసం వంటి విషయాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. మరి బెట్రీ, ఆర్మాండో చివరికి కలిసి ఉంటారా? మిషెల్ ఎంట్రీతో వారి పెళ్లి పరిస్థితి ఏమవుతుంది? ఎకోమోడాను కాపాడేది ఎవరు? చివర్లో వచ్చే ఊహించని వ్యక్తి ఎవరు? అనేదే సీజన్‌లో అసలు ట్విస్ట్.

తెలుగులో అందుబాటులో ఉందా?

Advertisement

‘Betty La Fea: The Story Continues’ సీజన్ 3లో అనా మారియా ఒరోజ్కో, జార్జ్ ఎన్రికే అబెల్లో, నటాలియా రామిరెజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సీజన్‌లో మొత్తం 10 ఎపిసోడ్లు ఉన్నాయి. సీజన్ 3 ఆగస్టు 28, 2026 నుంచి Prime Videoలో అన్ని ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ అవుతోంది. Prime Video లో  తెలుగు ఆడియోలో కూడా అందుబాటులో ఉంది.

Related News

మోగ్లీని రక్షించడానికి వచ్చిన విచిత్ర మృగం… కట్ చేస్తే 20 ఏళ్ల సీక్రెట్ బట్టబయలు… తెలుగులోనే స్ట్రీమింగ్

మహిళల ఇళ్లకు వచ్చే విచిత్రమైన బాక్సులు… కట్ చేస్తే వరుస హత్యలు… ప్రతి కేసు వెనుక ఒకే మైండ్

మ్యాచ్ ఆడుతుంటే స్టేడియంలో పదే పదే వినిపించే సీక్రెట్ విజిల్… శబ్దంతో కోచ్ కొంపముంచిన లేడీ

రాత్రికి రాత్రే రాక్ స్టార్ శవంగా… తీరా శవం దగ్గరకు వెళ్తే ఊహించని షాక్… డార్క్ హారర్ థ్రిల్లర్

కూతురి సీక్రెట్ డైరీతో స్టేజ్‌పై జోకులు… నిజం తెలిసి నిలదీసిన కూతురికి షాకింగ్ ట్విస్ట్… తెలుగులోనే ఈ సిరీస్

ఒంటరి తండ్రిని వదిలేసి పార్టీకి వెళ్లాలనుకున్న కొడుకు… చివరికి అదే తండ్రి కోసం మారిపోయిన కథ

పెళ్లాం, అత్త, ఇద్దరు కూతుళ్లను కాల్చేసిన డాక్టర్… తీరా ఆరా తీస్తే దేశాన్నే షాక్ చేసిన క్రైమ్ స్టోరీ

Big Stories

Advertisement
×