Priyanka Mohan (Image credit: Instagram)
కర్ణాటక బెంగళూరుకి చెందిన ప్రియాంక మోహన్ తొలిసారి కన్నడ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.. ఆ తర్వాత 2019లో నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

Priyanka Mohan (Image credit: Instagram)
2021లో శ్రీకారం సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియాంక.. సరిపోదా శనివారం సినిమాతో మరోసారి మెస్మరైజ్ చేసింది.

Priyanka Mohan (Image credit: Instagram)
ఇక గత ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓ జి సినిమాలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

Priyanka Mohan (Image credit: Instagram)
అలా తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసిన ప్రియాంక మోహన్.. కొరియన్ సినిమాలో కూడా నటిస్తోంది. ఇక వీటితోపాటు మరికొన్ని చిత్రాలలో నటిస్తూ బిజీగా మారింది ప్రియాంక.

Priyanka Mohan (Image credit: Instagram)
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులను అలరించే దిశగా అడుగులు వేస్తోంది.

Priyanka Mohan (Image credit: Instagram)
అందులో భాగంగానే బ్లాక్ మినీ అవుట్ ఫిట్ ధరించిన ప్రియాంక.. తన అందాలతో అభిమానులను మెస్మరైజ్ చేసింది. అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవుతూ పలురకాల కామెంట్లు చేస్తున్నారు.