E-Paper
Advertisement

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!
Advertisement

అఘోర పూజ‌లు, చేత‌బ‌డుల కామెంట్లు.. క్షుద్ర‌పూజ‌లు చేశార‌నే ఆరోప‌ణ‌లు.. వీటిపై తీవ్రంగా స్ప‌దించాడు హ‌రీశ్‌రావు. రేవంత్‌ను వ‌దిలేది లేద‌న్నాడు ఈ విష‌యంలో. పంద్రాగ‌స్టు నాడు ప‌చ్చి అబ‌ద్దాలు ఆడిన రేవంత్‌.. అస‌లు విష‌యాలు ప‌క్క‌కు పెట్టి.. జ‌నాల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డ‌మే కాకుండా ప‌నికి మాలిన మాట‌లు మాట్లాడుతున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తాడు..

సీఎం బ‌హిరంగ స‌భ త‌రువాత ఆయ‌న ప్ర‌త్యేకంగా సీఎం స్పీచ్‌పైనే ప్రెస్‌మీట్ పెట్టి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించాడు. తాను క్షుద్ర‌పూజలు చేసిన‌ట్టుగా సీఎం ప‌దే ప‌దే ఆరోపిస్తున్న అంశంపై ఘాటుగా స్పందించాడు.. చెప్పిన మాట‌ల‌న్నింటికీ ఆధారాలు చూపాలి… లేదంటే మీకు జైలు శిక్ష త‌ప్ప‌దు.. అని ఆయ‌న హెచ్చ‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Advertisement

ఇది వ‌ర‌కే అద్దంకి ద‌యాక‌ర్ త‌దిత‌రుల‌కు ఈ విష‌యంలో నోటీసులు జారీ చేసిన హ‌రీశ్‌.. టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ పై సైతం ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని హెచ్చ‌రించాడు. వెంట‌నే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశాడు. కానీ అక్క‌డ్నుంచి పెద్ద‌గా స్పంద‌న రాలేదు. పైగా మ‌హేశ్‌.. దీన్ని మ‌రింత రెచ్చ‌గొట్టేలా మాట్లాడాడు.

మా ద‌గ్గ‌ర అన్ని ఆధారాలున్నాయి… అవి బ‌య‌ట పెడ‌తాం.. ఏ కేసు పెట్టుకుంటావో పెట్టుకో.. అని స‌వాల్ విసిరాడు. ఇదిలా కొన‌సాగుతున్న త‌రుణంలోనే మ‌ళ్లీ సీఎం దీన్ని ఎత్తుకున్నాడు. క్షుద్ర పూజ‌లు చేశాడంటూ హ‌రీశ్‌పై ఆరోప‌ణ‌లు చేశాడు. మ‌ళ్లీ ఇవాళ పంద్రాగ‌స్టు వేళ.. హ‌రీశ్ సొంత ఇలాఖాలో స‌భ పెట్టి మ‌రీ ఈ క్షుద్ర పూజ‌ల‌పై విరుచుకుప‌డ్డాడు రేవంత్‌.

Advertisement

కేసులు పెడ‌తా అంటున్నావు క‌దా.. మ‌రి ఆ పూజ‌ల‌కు సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌పెట్టు.. పూజారుల పేర్లు బ‌య‌ట పెట్టు.. అని డిఫెన్స్‌లో ప‌డేసే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ చేత‌బడుల విష‌యాన్ని ఇంకా పెద్ద‌ది చేస్తూ.. మీరా రాజ్యాన్ని పాలించేది..? అఘోరా రావు.. అని సంబోధిస్తూ మ‌రింత రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశాడు రేవంత్‌.

బావ‌కు బామ్మ‌ర్ది స‌పోర్టు చేశాడ‌ని.. ఇద్ద‌రినీ ఈ క్షుద్ర పూజ‌ల్లోకి గుంజుకొచ్చే ప్ర‌య‌త్నం కూడా చేశాడు రేవంత్. ఇప్పుడు హ‌రీశ్ సీఎంపై, మ‌హేశ్ కుమార్ గౌడ్‌పైనా ప‌రువు న‌ష్టం దావా వేసేందుకు డిసైడ్ అయిపోయాడు హ‌రీశ్‌. ఈ చేత‌బ‌డుల పంచాయితీ ఇప్ప‌ట్లో ఆగేలా లేదు. ఎక్క‌డిదాకా తీసుకెళ్తుందో.. ఎవ‌రి కొంప ముంచుతుందో కూడా అంతు చిక్క‌డం లేదు..

Tags

Related News

ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!

కింగ్ కోహ్లీ భీకర విధ్వంసం.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేస్తాడా.!

ఎఫ్‌బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్.. అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై రూ. 8 కోట్ల రివార్డ్..!

పార్లమెంట్‌లో కీలక పరిణామం.. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కేంద్రం బిగ్ స్కెచ్!

పర్యాటకులకు శుభవార్త.. కైలాసగిరిపై మళ్లీ మోగనున్న టాయ్ ట్రైన్ కూత!

రేవంత్‌ మాస్టర్‌ స్ట్రోక్‌కు.. కేటీఆర్‌ మాస్టర్ ప్లాన్‌…! సీఎం టూర్‌ తరువాత మరో పథకం అనౌన్స్‌మెంట్‌కు సన్నాహాలు..?

జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్‌లో పన్నుల మోత.. క్యూర్ చట్టంలో సంచలన మార్పులు!

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల రగడ.. బీజేపీలో టికెట్ ఆశించే నాయకుల లిస్ట్ ఇదే?

Big Stories

Advertisement
×