Anna Lezhneva Photo Gallery
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ఇటీవల సమ్మర్ క్యాంప్ లో భాగంగా సింగపూర్లో ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు ,చేతులకు గాయాలయ్యాయి. అంతేకాదు పొగ వ్యాపించడం వల్ల మార్క్ శంకర్ ఊపిరితిత్తులలోకి పొగ చూరడంతో.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన మార్క్ శంకర్ ను వెంటనే సిబ్బంది హాస్పిటల్ కి తరలించారు.
Anna Lezhneva Photo Gallery
ఏప్రిల్ 8వ తేదీన ఈ సంఘటన జరగగా.. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అడవి తల్లి బాట కార్యక్రమంలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక వెంటనే సింగపూర్ కి బయలుదేరకుండా.. తాను పర్యటించాల్సిన పర్యటనను పూర్తి చేసి, ఆ మరుసటి రోజు ఏప్రిల్ 9న సింగపూర్ చేరుకున్నారు పవన్ కళ్యాణ్.
Anna Lezhneva Photo Gallery
ఇక అక్కడ మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, గొంతు, శ్వాసనాళాలలో పొగ చూరడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగానే బ్రాంకోస్కోపీ చేయించారు.
Anna Lezhneva Photo Gallery
ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం కుదుటపడడంతో భార్య అన్నా లెజ్నోవాతో పాటు కుమారుడు మార్క్ శంకర్ ను తీసుకొని నిన్న ఉదయం పవన్ కళ్యాణ్ హైదరాబాదు చేరుకున్నారు.
Anna Lezhneva Photo Gallery
అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా కొడుకు ఆరోగ్యంగా ఉండాలి అని, స్వామివారికి తలనీలాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఆమె స్వామి వారి అన్నదాన కార్యక్రమానికి మార్క్ శంకర్ పేరుమీద ఏకంగా 17 లక్షల రూపాయల విరాళాలు అందజేశారు.
Anna Lezhneva Photo Gallery
అంతేకాదు భోజనాశాలలో భక్తులకు స్వయంగా ఆహారం వడ్డించిన అన్నా లెజ్నోవా ఆ తర్వాత భక్తులతో కలిసి భోజనం చేశారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె తలనీలాలు సమర్పించడంతో బిడ్డ ఆరోగ్యం కోసం తల్లి పడే ఆవేదన అంతా ఇంతా కాదు. ఈ ప్రపంచంలోనే కాదు భూమి మీద ఉండే ఏకైక అత్యంత విలువైనది తల్లి మాత్రమే అంటూ పలువురు నెటిజన్స్ కొనియాడుతున్నారు.