గతంలో పోల్చితే దేశంలో విమానా ప్రయాణం మరింత అందుబాటులోకి వచ్చింది. కానీ, ఇప్పటి చాలా మంది విమానం ప్రయాణం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా భావిస్తారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. బస్సు టికెట్ ధరల్లోనే విమాన టికెట్లు లభిస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఇంతకీ విమాన టికెట్లు ఎప్పుడు చౌకగా లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టిప్స్ ఫాలో కావడం వల్ల విమాన ప్రయాణంపై భారీగా డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.
విమానాలను బుక్ చేసుకోవడానికి బెస్ట్ టైమ్
చౌకగా విమాన టికెట్లు బుక్ చేసుకోవాలంటే ముందుగానే ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే 4 నుంచి 6 వారాల ముందు టికెట్లు బుక్ చేసుకుంటే తక్కువ ధరకు టికెట్లు లభిస్తాయి. ప్రయాణ సమయం దగ్గర పడుతున్న కొద్దీ టికెట్ల ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా ప్రయాణానికి వారం రోజుల ముందు నుంచి భారీగా ధరలు పెరగుతాయి. ఒకవేళ మీరు దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్ లాంటి పీక్ సీజన్ లో ప్రయాణం చేయాలనుకుంటే కనీసం 2 నుంచి 3 నెలల ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
విమాన ప్రయాణానికి చౌకైన రోజులు
విమాన ఛార్జీలు అనేవి రోజు రోజుకు మారుతుంటాయి. అన్ని రోజులు సమానంగా ఉండవు. మిడ్ వీక్ విమానాలకు సంబంధించిన టికెట్లు తరచుగా అత్యంత సరసమైన ధరలో లభిస్తాయి. మంగళవారం, బుధవారం, గురువారం సాధారణంగా విమాన ప్రయాణానికి చౌకైన రోజులు చెప్పుకుంటారు. శుక్ర, ఆదివారాల్లో ప్రయాణం చేసే వారు టికెట్ల కోసం ఎక్కువగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మిడ్ వీక్ లో టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల గణనీయమైన తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది.
ఆఫ్ పీక్ సమయాల్లో తక్కువ ధరకే టికెట్లు
ప్రయాణీకులు జర్నీని ఎంచుకునే రోజు కూడా టికెట్ ధరల మీద ప్రభావం చూపిస్తుంది. ఆఫ్ పీక్ సమాయాల్లో నడిచే విమానాల టికెట్లు చౌకగా లభిస్తాయి. రెడ్-ఐ విమానాలు (రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య), మార్నింగ్ విమానాలు(సుమారు ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు) రాకపోకలు కొనసాగించే ఈ రైళ్లు బడ్జెట్ కు అనుకూలంగా ఉంటాయి. మధ్యాహ్నం, సాయంత్రం రాకపోకలు కొనసాగించే విమానాలు ఎక్కువ ధరను కలిగి ఉంటాయి.
విమాన ప్రయాణాలు చేయడానికి చౌకైన సీజన్లు
మన దేశంలో వాతావరణం, పండుగ క్యాలెండర్ విమాన ఛార్జీల ధరలను బాగా ప్రభావితం చేస్తాయి. ఎప్పుడు చౌకగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ వర్షాకాలం (జూలై నుంచి సెప్టెంబర్ వరకు): వర్షాకాలం అనేక ప్రాంతాలకు ముఖ్యంగా గోవా, కేరళ లాంటి తీర ప్రాంతాలకు సంబంధించిన ప్రయాణ డిమాండ్‌ను తగ్గిస్తుంది.
⦿ సెలవుల తర్వాత(జనవరి చివరి నుంచి మార్చి ప్రారంభం వరకు): నూతన సంవత్సరం తర్వాత, హోలీకి ముందు ప్రయాణ డిమాండ్ తగ్గుతుంది. ఈ సమయంలో తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.
సరసమైన టికెట్ ధరలను తెలుసుకునేందుకుGoogle Flights, Skyscanner, MakeMyTrip లేదంటే Cleartrip వంటి టికెట్ బుకింగ్ యాప్ లను తరచుగా ఓపెన్ చేస్తూ ధరలను కంపార్ చేయాలి.
Read Also: ఇండియాలోని ఆ ప్రాంతంపై.. విమానాలు ఎగరలేవు.. అంత ఈజీ కూడా కాదు.. ఎందుకంటే?