E-Paper
Advertisement

PSL’s 2025 motorbike: IPL ముందు PSL దేనికి పనికిరాదు… ఇక్కడ కార్లు ఇస్తే… అక్కడ స్కూటర్లు.. ఇదేం కర్మ రా

PSL’s 2025 motorbike: IPL ముందు PSL దేనికి పనికిరాదు… ఇక్కడ కార్లు ఇస్తే… అక్కడ స్కూటర్లు.. ఇదేం కర్మ రా
Advertisement

PSL’s 2025 motorbike: పాకిస్తాన్ సూపర్ లీగ్ పదవ సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ లీగ్ లో ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు ముగిసాయి. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో పోటీపడేందుకు పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రయత్నిస్తోంది. ప్రతి విషయంలోనూ ఐపీఎల్ ని కాపీ చేస్తూ నవ్వుల పాలవుతుంది. ఐపీఎల్ ఆడేందుకు దేశ విదేశీ ఆటగాళ్లు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కూడా కొంతమంది విదేశీ ఆటగాళ్లు ఆడుతుంటారు.

 

Advertisement

ప్రతి సంవత్సరం ఈ లీగ్ ఫిబ్రవరి నుండి మార్చి వరకు జరుగుతుంది. అయితే కొన్ని కారణాలవల్ల పాకిస్తాన్ సూపర్ లీగ్ ఏప్రిల్ కి మారింది. ఏప్రిల్ 11న ప్రారంభమైన ఈ పిఎస్ఎల్ పదవ ఎడిషన్ కి ప్రేక్షకుల కొరత ఏర్పడింది. ఈ లీగ్ లో కొంతమంది స్టార్ క్రికెటర్లు ఆడుతున్నప్పటికీ.. ప్రేక్షకులు స్టేడియానికి రావడం లేదు. అయితే ఈ రెండు లీగ్ ల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం మ్యాచ్ లు లేదా లీగ్ లో వెచ్చిస్తున్న డబ్బుల గురించి మాత్రమే కాక.. పీఎస్ఎల్ కూడా ఐపీఎల్ తో పోటీపడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

ఇటీవల కరాచీలో జరిగిన ఓ మ్యాచ్ లో వింత అనుభవం ఎదురైంది. దీంతో నెటిజెన్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ ని ఎగతాళి చేయడం ప్రారంభించారు. ఈ లీగ్ లోని 3వ మ్యాచ్ ముల్తాన్ సుల్తాన్స్ – కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కరాచీ కింగ్స్ కి చెందిన “జేమ్స్ విన్స్” 43 బంతుల్లో 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ కి జేమ్స్ విన్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. అయితే ఆశ్చర్యకరంగా గౌరవ సూచకంగా అతనికి ఒక హెయిర్ డ్రైయర్ ని బహుమతిగా ఇచ్చారు.

Advertisement

ఈ వీడియోని కరాచీ కింగ్స్ తమ అధికారిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా.. అభిమానులు పాకిస్తాన్ సూపర్ లీగ్ ని ఎగతాళి చేయడం ప్రారంభించారు. గల్లీ క్రికెట్ లో గెలిచిన జట్టుకు ఇంకా మంచి బహుమతి ఇస్తారని పాకిస్తాన్ సూపర్ లీగ్ ని ఎగతాలి చేశారు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన వారికి కార్ ని బహుమతిగా ఇస్తూ ఉండడం చూస్తుంటాం. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ లో మాత్రం ఓ టూ వీల్లర్ ని {PSL’s 2025 motorbike} బహుమతిగా ఇస్తున్నారు.

 

ఆదివారం రోజు లాహోర్ – క్యూట్ట జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతిగా ఇచ్చే టూ వీలర్ ఫోటో వైరల్ గా మారింది. దీంతో మరోసారి పాకిస్తాన్ పరువు పోయింది. ఈ నేపథ్యంలో నటిజెన్లు మరోసారి పాకిస్తాన్ సూపర్ లీగ్ ని ఎగతాళి చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో పోటీపడి పాకిస్తాన్ తన పరువును పూర్తిగా తీసుకుంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×