International Day Against Drug ( Source/ Twitter)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
International Day Against Drug ( Source/ Twitter)
తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించబడుతుండగా సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, బ్యాట్మంటిన్ కోచ్ పుల్లెల గోపీచంద్, సినీ నిర్మాత దిల్ రాజు, బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తదితర రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు..
International Day Against Drug ( Source/ Twitter)
ఇక 15 పాఠశాలల నుంచి సుమారు 2,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో TGANB అధికారులు షార్ట్ ఫిల్మ్‌లు, టెస్టిమోనీలు ప్రదర్శించారు మరియు ప్లెడ్జ్ వాల్ ఏర్పాటు చేశారు..
International Day Against Drug ( Source/ Twitter)
సీఎం రేవంత్ మాదక ద్రవ్య రహిత సురక్షితమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిస్తూ తన X ఖాతా వేదికగా పోస్ట్ చేశారు.
International Day Against Drug ( Source/ Twitter)
యువతను ఆరోగ్యకరమైన ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించడమే లక్ష్యంగా కలిసి పని చేద్దామని కోరారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ సంకల్పానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆ కార్యక్రమం ఫోటోలు వైరల్ అవుతున్నాయి..