BigTV English

Beauty Tips: ఫేస్ క్రీమ్స్‌కు ఇక గుడ్ బై.. ఈ ప్యాక్స్‌తో మెరిసే ముఖం మీ సొంతం

Beauty Tips: ఫేస్ క్రీమ్స్‌కు ఇక గుడ్ బై.. ఈ ప్యాక్స్‌తో మెరిసే ముఖం మీ సొంతం

Beauty Tips: చూడగానే అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు ఎంతగానో కోరుకుంటారు. అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ఎవెవో ప్రయత్నాలు చేస్తుంటారు. తెల్లగా ఉన్నవారే అందంగా ఉంటారని కాదు, ఉన్న రంగు మెరుగ్గా కనిపించి చర్మం తాజాగా కనిపిస్తే చాలా అటోమెటిక్‌గా అందంగా కనిపిస్తారు. ఇలా అందంగా కనిపించాలని బ్యూటిపార్లర్స్ చూట్టు తిరుగుతూ.. కరిదైన క్రిమ్స్ రాయల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు అందంగా కనిపిస్తారు. ఆ టిప్స్ ఎంటో తెలుసుకుందాం.


ఈ చిట్కాల వల్ల ముఖం ఉన్న సమస్యలు తగ్గిపోయి అందంగా కనిపిస్తారు. వీటిని ముఖానికి రాయడం వల్ల చర్మం రంగు మెరుగ్గా మారడమే కాకుండా చాలా అందంగా కనిపిస్తారు. అంతేకాకుండా వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

పెరుగుతో ఫేస్ ప్యాక్:
స్కిన్ టోన్ మెరుగ్గ చేయడంలో పెరుగు చాలా బాగా పనిచేస్తుంది. కావున పెరుగుతో ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవడం చాలా లాభాలు ఉన్నాయి. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా మెరిసిపోతుంది.


ఫేస్ ప్యాక్ తయారి విధానం:
ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ఓట్స్, రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక స్పూన్ పెరుగును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఒక పదిహేను నిమిషాలు ఉంచి ఆరిన తర్వాత.. ముందుగా కొంచెం నీటితో ముఖం తడిపి రబ్ చేసుకోవాలి.. దీని తర్వాత చల్లని నీటితో కడగాలి. పెరుగులో లాక్టిక్ యాసిడ్, బ్లీచింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ముఖం కాంతివంతంగా అవుతుంది.

ఎర్ర ఉల్లిపాయ ఫేస్ ప్యాక్:
ఎర్ర ఉల్లిపాయలో పోడిబారిన చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అంతేకాకుండా స్కిన్ ఫిగ్మెంటేషన్ సమస్యను కూడా తగ్గిస్తుంది. ఎర్ర ఉల్లిపాయ రసంతో కూడిన మార్కెట్లో లభించే ఉత్పత్తులను కూడా ప్రయోగిస్తే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది.

పాలతో ఫేస్ ప్యాక్:
పాల మీగడలో కొద్దిగా పసుపు వేసి అందులో తెనే వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. తర్వాత దీంతో ముఖానికి ఫేస్ ప్యా్క్ వేసి ఉంచాలి. వేసుకున్న 20 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. దీంతో మీ ముఖం ప్రకాశవంతంగా, మిలమిల మెరిసిపోతుంది.

తేనె ఫేస్ ప్యాక్:
తేనె చర్మానికి తగినంత తేమనిస్తుంది. ముఖానికి తేనెను పట్టించే ముందు టవల్‌తో తుడుచుకోవాలి. కొద్దిగా తేనెను అరచేతుల్లో తీసుకుని, మసాజ్ చేస్తునట్టుగా ముఖానికి రాసుకుని కొద్ది నిమిషాలు అలాగే ఉంచాలి. కాసేపయ్యాక ముఖాన్ని వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఉన్న మురికి పోయి మెరుస్తుంది.

Also Read: రూట్ మార్చి సెన్సేషన్ అవుతున్న జగన్

తులసి ఆకుతో ఫేస్ ప్యాక్:
ముందుగా తాజా తులసి ఆకులను తీసుకుని వాటిని మెత్తగా నూరి ఫేస్ట్ చేసుకోవాలి. దీని తర్వాత ఆ ఫేస్ట్‌ను ముఖానికి రాసుకొని దానిని ఆరనివ్వాలి. ఆ తర్వత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మరకలు, మచ్చలు పోయి ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది.

వీటితో పాటుగా ఆహారంతో కూడా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. తాజా కూరగాయలు, ఆకు కూరలు తినడం వల్ల శరీరంలో విటమిన్ల శాతం అవసరమైనంత మేరకు పెరుగుతుంది. విటిమన్లు చర్మాన్ని తాజాగా వుంచుతాయి.

Related News

Breakfast: ఉదయం పూట.. ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ తినాలో తెలుసా ?

Back Pain: నడుము నొప్పి రావడానికి అసలు కారణాలివే !

Face Yoga: ఫేస్ యోగాతో.. ఇన్ని లాభాలా ?

Hibiscus Leaves: మందార ఆకులను ఇలా వాడితే.. తలమోయలేనంత జుట్టు

Cow Urine: గో మూత్రం తాగడం లాభమా? నష్టమా?

Red Banana: ఎర్రటి అరటి పండు ఎప్పుడైనా తిన్నారా? కనబడితే వెంటనే కొనేయండి!

Big Stories

×