S.S. Thaman: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ (S.S Thaman)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంగీతంపై ఎంతో ఆసక్తి ఉన్న తమన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలతో ఏమాత్రం తీరిక లేకుండా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక త్వరలోనే ఈయన సంగీత సారథ్యంలో తెరికెక్కిన సినిమాలన్నీ వరుసగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇలా ఒకవైపు సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్న తమన్ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ నిజం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
క్రికెట్ ప్రేమికుడు…
ఇక ఈయనకు సంగీతం అంటే ఎంత ఇష్టమో క్రికెట్ (Cricket)అంటే కూడా అంతే ఇష్టమనే సంగతి తెలిసిందే. ప్రతిరోజు సాయంత్రం ఆయన క్రికెట్ ఆడనితే తన రోజు పూర్తి కాదని ఇటీవల ఓ సందర్భంలో తెలియజేశారు. సీసీఎల్ లీగ్ లో తెలుగు వారియర్స్ టీమ్ లో తమన్ కీలక ప్లేయర్ అనే విషయం మనకు తెలిసిందే అయితే తాజాగా ఈయన క్రికెట్ కి సంబంధించిన ఒక వీడియోని తన ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ డోంట్ బౌల్ షార్ట్ బాల్ బ్రో అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
నువ్వు ధోని ఫ్యాన్ ….
ఇక ఈ వీడియో పై కొంతమంది ఆకతాయిలు విమర్శిస్తూ రీ ట్వీట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ రిప్లై ఇస్తూ తమన్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. షార్ట్ కు.. స్లాట్ కు తేడా తెలియనప్పుడే నాకు అర్థమైంది.. నువ్వు ధోని ఫ్యాన్ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఇలా సదరు వ్యక్తి కామెంట్ చేయడంతో మండిన తమన్ వెంటనే ఆయనకు రిప్లై ఇస్తూ…”ఒకే రా.. వచ్చి నేర్చుకుంటా అడ్రస్ పంపు బే” అంటూ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక తమన్ చేసిన ఈ పోస్టుపై పలువురు స్పందిస్తూ తమన్ చెప్పింది కరెక్టే నువ్వే అసలు విషయం తెలియక కామెంట్ చేసావు అంటూ తమన్ కు మద్దతు తెలియజేస్తున్నారు.
Ok Ra Vachiii nerchukunntaaa adresss pammpu bae ! https://t.co/B0M6AGbnO7
— thaman S (@MusicThaman) June 25, 2025
Don’t bowl short bro 🤪🔥💥 !! pic.twitter.com/sIUMcd2iaY
— thaman S (@MusicThaman) June 24, 2025
ఇలా తమన్ తన గురించి ఎవరైనా ఇలాంటి విమర్శలు చేస్తూ కామెంట్లు చేస్తే మాత్రం చూసి చూడనట్టు వదిలిపెట్టరు, వారికి తనదైన శైలిలోనే సమాధానాలు చెబుతూ ఉంటారు. ఇలా ఎన్నో సందర్భాలలో తనని టార్గెట్ చేయడంతో ఈయన కూడా వారికి తన స్టైల్ లోనే రిప్లై ఇస్తూ వచ్చారు.. ఇక తమన్ సినిమాల విషయానికి వస్తే ఈయన త్వరలోనే అఖండ2(Akhanda 2), ఓజీ(OG) వంటి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ రెండు సినిమాల కోసం కూడా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల అక్కడ నుంచి టీజర్ విడుదల కాగా ఈ టీజర్ లో తమన్ ఇచ్చిన బిజీ ఎం హైలెట్ గా నిలిచింది. ఇక ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
Also Read: Mitraaw Sharm : ఇండస్ట్రీకి మంచు లక్ష్మీ చెల్లి వచ్చేసిందిరో.. ఆ మాటలెంటో, ఆ డైలాగ్స్ ఏంటో ?