Hebah Patel Latest Photos: గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత హీరోయిన్లకు వరుసగా అలాంటి పాత్రలే వస్తుంటాయి. అయినా అలాంటి పాత్రలతో కూడా క్రేజ్ సంపాదించుకున్న వారు ఉన్నారు. అందులో ఒకరు హెబ్బా పటేల్. (Image Source: Hebah Patel/Instagram)
‘కుమారి 21 ఎఫ్’ అనే సినిమాతో తెలుగులో హెబ్బా పటేల్‌కు ఎనలేని పాపులారిటీ లభించింది. అయితే ఆ సినిమాలో తను గ్లామర్‌తో పాటు ఆడియన్స్‌కు గుర్తుండిపోయే పాత్రలో కనిపించింది. (Image Source: Hebah Patel/Instagram)
‘కుమారి 21 ఎఫ్’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. దాని వల్ల తనకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ అవేమీ లాభం లేకుండా పోయింది. హెబ్బా కెరీర్ ఆ తర్వాత పెద్దగా ముందుకు వెళ్లలేకపోయింది. (Image Source: Hebah Patel/Instagram)
హెబ్బా పటేల్‌కు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. ‘కుమారి 21 ఎఫ్’ తర్వాత తను ఎన్నో సినిమాల్లో కూడా నటించింది. అవి హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఈ అమ్మడుకు మాత్రం మళ్లీ ఆ రేంజ్‌లో క్రేజ్ దక్కలేదు. (Image Source: Hebah Patel/Instagram)
మెల్లగా హెబ్బా పటేల్‌కు వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఆన్ స్క్రీన్ ఎక్కువగా కనిపించడం మానేసింది. దీంతో సోషల్ మీడియా ద్వారానే ఫ్యాన్స్‌తో ఎక్కువగా కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టింది. (Image Source: Hebah Patel/Instagram)
మళ్లీ తాను ఫార్మ్‌లోకి రావడం కోసం ఫార్మ్‌లో లేని యంగ్ హీరోలతో కూడా నటించడం మొదలుపెట్టింది హెబ్బా పటేల్. కానీ అది కూడా తన కెరీర్‌కు ప్లస్ కాలేకపోయింది. (Image Source: Hebah Patel/Instagram)
ప్రస్తుతం హెబ్బా పటేల్ చేతిలో పలు చిన్న చిత్రాలు ఉన్నా కూడా అవి హిట్ అయ్యి మళ్లీ తనను ఫార్మ్‌లోకి తీసుకొస్తాయనే నమ్మకం లేదు. సినిమాల విషయం ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తన క్రేజ్ తగ్గలేదు. (Image Source: Hebah Patel/Instagram)
చివరిగా ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ అనే రొమాంటిక్ డ్రామాలో నటించింది హెబ్బా పటేల్. అందులో చైతన్యతో జోడీకట్టింది. కానీ ఈ మూవీ థియేటర్లలో ఎప్పుడు విడుదలయ్యిందో కూడా చాలామంది ప్రేక్షకులకు తెలియదు. (Image Source: Hebah Patel/Instagram)
తాజాగా బ్లాక్ డ్రెస్సులో ఫోటోలు షేర్ చేసి క్లాస్సీ అనే పదానికి అర్థం చెప్తోంది హెబ్బా పటేల్. ఈ డ్రెస్సులో తను చాలా బాగుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (Image Source: Hebah Patel/Instagram)