Secunderabad Tragedy: మీ పిల్లలు చపాతీ తింటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త. పెద్దల సమక్షంలో పిల్లలు చపాతీ తినాల్సిన రోజులు వచ్చాయి. ఓ బాలుడు దురదృష్టవశాత్తు చపాతీ తిని మృత్యు ఒడిలోకి చేరాడు. అందుకే మీ పిల్లలు చపాతీ తినే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు. ఇంతకు ఆ విద్యార్థి ఎలా మృతి చెండాదంటే..
సికింద్రాబాద్ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ లో విరల్ జైన్ అనే బాలుడు ఆరవ తరగతి విద్యను అభ్యసిస్తున్నాడు. రోజువారి మాదిరిగానే బడికి వచ్చి చదువుకున్నాడు. మధ్యాహ్నం అయింది. తన క్యారేజ్ తీసుకొని తినేందుకు కూర్చున్నాడు. తోటి విద్యార్థులు కూడా అలాగే కూర్చొని తినడం ప్రారంభించారు. విరల్ జైన్ కూడా తన క్యారేజ్ ఓపెన్ చేసి, చపాతీ తినడం ప్రారంభించాడు. చపాతీ అంటే చపాతీ రోల్ తీసుకొని నోటిలో పెట్టుకున్నాడు.
అలా కాస్త తిన్నాడు. మరలా కాస్త ఆరగించాడు. ఇక అంతే ఊపిరి ఆడని పరిస్థితి. సక్రమంగా శ్వాస అందకపోవడంతో తన స్నేహితులకు తెలిపాడు. వారు హుటాహుటిన పాఠశాల ఉపాధ్యాయులకు తెలిపారు. ఉపాధ్యాయులు కూడా అసలేం జరిగిందంటూ ఉరుకులు, పరుగుల మీద అక్కడికి చేరుకున్నారు. చివరికి ప్రవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు సమాయత్తమై స్పీడ్ గా జైన్ ను వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే ఊపిరి ఆడకుండా ఇబ్బందులు ఎదుర్కొన్న జైన్, పాపం మార్గమధ్యలోనే విలవిలలాడాడు. చివరికి తన ప్రాణాలు వదిలాడు.
Also Read: Ram Gopal Varma Case: వర్మ వెనక ఉన్న టాలీవుడ్ హీరో ఎవరు..? ఆ ఫామ్ హౌజ్ ఎక్కడ ఉంది..?
ఈ విషయం తెలుసుకున్న జైన్ కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున వైద్యశాల వద్దకు చేరుకున్నారు. తమ కన్నకొడుకు మృతి చెందడంతో అతని తల్లి రోదనలు మిన్నంటాయి. అలాగే విరల్ జైన్ ఫ్రెండ్స్, టీచర్స్ కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. చపాతీ రోల్ నోటిలో పెట్టుకున్న సమయంలో గొంతులో ఇరుక్కు పోవడంతో జైన్ మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు. తన బిడ్డ సాయంత్రం పాఠశాల నుండి వస్తాడని ఎదురు చూపుల్లో ఉన్న అతని తల్లిదండ్రులు విషాదంలో మునిగి పోయారు.
చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి
సికింద్రాబాద్ అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ పాఠశాలలో విషాదం
మధ్యాహ్నం భోజన సమయంలో విరల్ జైన్ అనే ఆరో తరగతి విద్యార్థి తింటుండగా గొంతులో ఇరుక్కున్న చపాతీ రోల్
శ్వాస ఆడకపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన విద్యార్థి
ఆసుపత్రికి… pic.twitter.com/K2JtpUthIN
— BIG TV Breaking News (@bigtvtelugu) November 25, 2024