Aditi Dev Sharma: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న హీరోయిన్స్, అనూహ్యంగా వివాహము చేసుకుంటున్నారు. అయితే అందులో కొంతమంది మళ్ళీ ఇండస్ట్రీలో కొనసాగితే, మరికొంతమంది ఏకంగా ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. అలాంటి వారిలో ఉదయ్ కిరణ్ (Uday Kiran)హీరోయిన్ అదితి దేవ్ శర్మ (Aditi Dev Sharma) కూడా ఒకరు.. ఈమె “గుండె ఝల్లుమంది” సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకుంది. తన అంద చందాలతో యువతను మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ, ఇండస్ట్రీలో కొనసాగుతుందని అందరూ అనుకున్నారు.కానీ అనూహ్యంగా కొన్ని చిత్రాలకే పరిమితమై పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది.
మళ్లీ తల్లి అయిన అదితి దేవ్ శర్మ..
ఉదయ్ కిరణ్ తో కలిసి గుండె ఝల్లుమంది చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమై ఆ తర్వాత ఓంశాంతి, బబ్లూ వంటి సినిమాలలో నటించింది. అనంతరం పలు టీవీ షోలు, సీరియల్స్ లో నటించి భారీ పాపులారిటీ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక 2014లో నటుడు సర్వార్ అహుజా ను వివాహం చేసుకుంది. గతంలో ఈమెకు కుమారుడు జన్మించగా, ఈరోజు మళ్లీ అమ్మాయికి జన్మనిచ్చింది అదితి దేవ్ శర్మ. అలా మొదట అబ్బాయికి, ఇప్పుడు అమ్మాయికి జన్మనివ్వడంతో ప్రముఖ సినీ సెలబ్రిటీలందరూ ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాదు అమ్మాయి ఫోటోను చూపించమని కూడా కోరుతున్నారు. మొత్తానికైతే లిటిల్ క్యూట్ బేబీని తమ జీవితంలోకి ఆహ్వానిస్తూ సంతోషం వ్యక్తం చేశారు ఈ జంట.
ఉదయ్ కిరణ్ మూవీతో తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీ..
ఇక ఈమె విషయానికి వస్తే.. 1983 ఆగస్టు 24న.. ఉత్తరప్రదేశ్ లక్నోలో జన్మించింది. సినిమా రంగం మీద ఆసక్తి ఉన్న ఈమె, మొదట 2007లో హిందీ సినిమా అయిన ఖన్నా అండ్ అయ్యర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక 2008లో బ్లాక్ అండ్ వైట్ అనే మరో హిందీ సినిమాతో అక్కడి ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈమె, 2008లో గుండె ఝల్లుమంది అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో నీలు క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. అంతేకాదు ఇప్పటికీ ఇదే పేరుతో తెలుగు ఆడియన్స్ పిలుస్తున్నారు అంటే ఆ పాత్రలో ఎంతలా లీనమైందో అర్థం చేసుకోవచ్చు.
అదితి దేవ్ శర్మ కెరియర్..
ఆ తర్వాత ఏడాది ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన ఈమె 2010లో ఓం శాంతి సినిమాతో మళ్లీ తెలుగులో నటించి ఆకట్టుకుంది. ఇక తర్వాత 2011లో బబ్లూ సినిమా చేసింది. ఇక అదే తెలుగు చివరి చిత్రం కావడం గమనార్హం. ఆ తర్వాత 2016 వరకు హిందీలో పనిచేసిన ఈమె వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడింది. అలా వివాహం చేసుకున్న ఈమె ఇప్పుడు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈమె వయసు 41 సంవత్సరాలు. తన అందంలో ఏ మార్పు రాలేదని, మీ పాపకు రెండు సంవత్సరాలు పూర్తయితే మళ్లీ ఇండస్ట్రీలోకి మీరు అడుగుపెట్టండి అంటూ కూడా ఈమెను కోరుతున్నారు. మరి అదితి అభిమానుల కోరిక మేరకు మళ్ళీ ఇండస్ట్రీలోకి వస్తుందా. లేక కుటుంబానికే తన జీవితాన్ని పరిమితం చేస్తుందా? అన్నది చూడాలి. ఏది ఏమైనా తెలుగు బ్యూటీ మళ్లీ తల్లి అవడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.