Jyothika (Source: Instragram)
ఒకప్పుడు వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన జ్యోతిక.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యాను వివాహం చేసుకున్న తర్వాత సినిమాల జోరు కాస్త తగ్గించిందని చెప్పాలి. ముఖ్యంగా తన భర్త సూర్య నటించే చిత్రాలకు నిర్మాతగా మారిన ఈమె..అప్పుడప్పుడు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.
Jyothika (Source: Instragram)
ఈ క్రమంలోనే తాజాగా 'డబ్బా కార్టెల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 28వ తేదీ నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయింది ఈ ముద్దుగుమ్మ.
Jyothika (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. పెళ్లయి ఇన్నేళ్లు అవుతున్నా.. ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఈమె అందం విషయంలో ఏమాత్రం మార్పు లేకపోవడం చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Jyothika (Source: Instragram)
తాజాగా వైట్ కలర్ షర్ట్, డెనిమ్ జీన్స్ ధరించిన జ్యోతిక స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది.
Jyothika (Source: Instragram)
చాలా కూల్ గా బల్లపై కూర్చుని తన అందాలతో ఆకట్టుకుంది. అలాగే సన్ గ్లాసెస్ పెట్టుకొని మరింత స్టైలిష్ గా కనిపించింది.
Jyothika (Source: Instragram)
హై హీల్ చెప్పల్ తో తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది జ్యోతిక. ఓవరాల్ గా తన అందంతోనే కాదు స్టైలిష్ లుక్కుతో కూడా ఆకట్టుకుంటోంది.