Mehreen Pirzada: తక్కువ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా.

టాలీవుడ్ మూవీతో గ్లామర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పంజాబీ బ్యూటీ వెనుదిరిగి చూడలేదు.

పరిశ్రమకు వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు గడుస్తోంది. ఈ ఏడాది కాస్త గ్యాప్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.

తొలుత నాని మూవీ ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో మెరిసింది. స్క్రీన్‌పై ఈ సుందరిని చూడగానే టాలీవుడ్‌లో మాంచి లైఫ్ ఉంటుందని భావించారు.

అన్నట్లుగానే తెలుగులో దాదాపు అందరి హీరోల సరసన నటించింది. అందమే ఆమెకు మరిన్ని ఆఫర్లు తెచ్చిపెట్టాయని ఇండస్ట్రీలో కొందరు పెద్దల మాట.

సింపుల్‌గా చెప్పాలంటే టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

కాకపోతే రాళ్లు వేసినవాళ్లు లేకపోలేదనుకోండి. అదే వేరే విషయం.

లేటెస్ట్‌గా దీపావళి నేపథ్యంలో తన అందాన్ని ఎలివేట్ చేసే విధంగా డ్రెస్ ధరించింది.

ఆరేడు ఫోటోలకు పోజులిచ్చింది. జస్ట్ 20 అన్నమాదిరిగా కనిపించింది.

మళ్లీ మెహ్రీన్ యాక్టివేట్ అవుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.