Mrunal Thakur Latest Photos: బుల్లితెర నుండి వెండితెరపైకి వచ్చిన చాలా తక్కువమంది హీరోయిన్లు ఒక రేంజ్‌లో సక్సెస్ అందుకుంటారు. అందులో ఒకరు మృణాల్ ఠాకూర్.
పలు సీరియల్స్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను చాలా ఏళ్ల నుండి అలరిస్తూ వస్తోంది ఈ మరాఠీ బ్యూటీ.
హిందీలో సీరియల్స్‌తో ఫేమ్ సంపాదించుకున్న తర్వాత మరాఠీలో వెండితెరపై హీరోయిన్‌గా అడుగుపెట్టింది.
తన డెబ్యూ మూవీ మరాఠీలోనే అయినా అక్కడ ఎక్కువకాలం నిలిచిపోలేదు మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ వైపు అడుగులేసింది.
హిందీలో పలు బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించిన తర్వాత ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది.
‘సీతారామం’లో సీత పాత్రలో మృణాల్‌ను చూసిన ప్రేక్షకులంతా తనను సీతగానే ఫిక్స్ అయిపోయారు. కానీ ఆఫ్ స్క్రీన్ మృణాల్ చాలా వేరు.
సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంది ఈ భామ. కానీ ఈ ఫోటోషూట్స్ చాలామంది ఫ్యాన్స్‌కు నచ్చలేదు.
తాజాగా సైమా అవార్డుల వేడుక కోసం కాటుక కళ్లతో, చీరకట్టులో ముస్తాబయ్యింది మృణాల్ ఠాకూర్.
సైమా ఈవెంట్ కోసం తాను రెడీ అయిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇది కదా మాకు కావాల్సింది అని ఫ్యాన్స్ అంటున్నారు.