 
					Online Scam: కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రేమానంద్ ఇటీవల ఆన్‌లైన్‌లో Samsung Galaxy Z Fold 7 స్మార్ట్‌ఫోన్ బుక్ చేశారు. ఫోన్ కు బదులుగా డెవవరీ బాక్స్ లో టైల్ ముక్క రావడంతో టెక్కీ షాక్ కు గురయ్యాడు. అమెజాన్ డెలివరీ స్కామ్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రూ.1.86 లక్షలు పోగొట్టుకున్నారు. యెలచెనహళ్లికి చెందిన ప్రేమానంద్ అక్టోబర్ 14న ఆన్ లైన్ లో ఫోన్ కొనుగోలు చేశాడు.
ఈ ప్యాకేజీ అక్టోబర్ 19వ తేదీ సాయంత్రం 4.16 గంటలకు డెలివరీ అయింది. ప్రేమానంద్ ఫోన్ అన్‌బాక్సింగ్ వీడియోను రికార్డ్ చేశాడు. ఈ బాక్స్ లో స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా స్క్వేర్ రూపంలో తెల్లటి టైల్స్ ముక్క ఉండడం చూసి షాక్ అయ్యాడు. ఆన్ లైన్ లో ఫోన్ ఆర్డర్ చేస్తే టైల్స్ ముక్క వచ్చిందని ప్రేమానంద్ పోలీసులను ఆశ్రయించారు. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 66D కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఆన్ లైన్ మోసం వెనుక ఉన్న వారిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కు బదులుగా టైల్స్ వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Bengaluru Techie orders a smart phone from @amazonIN gets a stone tile instead. FIR registered. The Samsung Galaxy Fold 7 cost him 186,999. He recorded the unboxing on video, amazon has issued a refund, but cops continue probe. pic.twitter.com/KDMONtqfHJ
— Deepak Bopanna (@dpkBopanna) October 30, 2025
ఇటీవల ముంబైలో ఇలాంటి ఘటన జరిగింది. ఆన్‌లైన్ డెలివరీ యాప్ ద్వారా లీటరు పాలు ఆర్డర్ చేయడానికి ప్రయత్నించిన 71 ఏళ్ల వృద్ధురాలి నుంచి రూ.18.5 లక్షలు కాజేశారు సైబర్ కేటుగాళ్లు. ముంబై వడాలాలో నివసిస్తున్న ఓ మహిళకు పాల కంపెనీ ఎగ్జిక్యూటివ్ నుంచి ఫోన్ వచ్చింది. అతడు వృద్ధురాలికి ఫోన్ కు ఒక లింక్ పంపి ఆర్డర్ పూర్తి చేయమని కోరాడు.
Also Read: UP Crime: పెళ్లి ఆపేందుకు వెళ్లాడు.. ప్రియుడ్ని కట్టేసి చంపేశారు, గొంతు కోసుకున్న ప్రియురాలు
సైబర్ మోసమని గుర్తించక ఆమె అతడి సూచనలను పాటిస్తూ దాదాపు గంటసేపు ఫోన్ లో మాట్లాడింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆమె తన మూడు బ్యాంకు ఖాతాల నుంచి రూ.18.5 లక్షలు పోగొట్టుకుంది. ఒక మోసపూరిత లింక్ ద్వారా స్కామర్ ఆమె ఫోన్‌ను యాక్సెస్ చేసి డబ్బులు కాజేశాడని పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్ కొనుగోలు చేసినప్పుడు లేదా వ్యక్తిగత వివరాలను పంచుకునేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.