 
					USSD fraud: బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాము.. మీ బ్యాంక్ అకౌంట్ హోల్డ్ అయింది.. మళ్లీ కేవైసీ చేసుకోవాలంటూ ఫోన్లు చేసి, ఓటీపీ అడిగి అకౌంట్ల నుంచి డబ్బులు దోచుకున్న సైబర్ నేరగాళ్లు రోజుకో తీరుగా మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల డిజిటల్ అరెస్ట్ అంటూ కోట్లలో స్కాంలకు పాల్పడుతున్న ఘటనలు చూశాం. బాధితుల సోషల్ మీడియా అకౌంట్ల నుంచి బాధితుడి సన్నిహితులకు సందేశాలు పంపి, ఆపదలో ఉన్నామంటూ డబ్బులు పంపాలన్న మోసాలు వెలుగు చూశాయి. తాజాగా సైబర్ కేటుగాళ్లు కొత్త రకమైన “ఫార్వర్డింగ్ స్కాం”ను ఉపయోగిస్తున్నారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. తరచుగా, సైబర్ మోసగాళ్ళు బ్యాంకు లేదా సెల్ ప్రొవైడర్ కంపెనీల నుంచి వచ్చినట్లు నటిస్తూ పౌరులను సంప్రదిస్తారు. బాధితుడి KYC అసంపూర్ణంగా ఉందని లేదా సిమ్ త్వరలో డియాక్టివేట్ అవుతుందని హెచ్చరిస్తారు. ఈ మోసాలలో అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా (USSD) కోడ్‌లను ఉపయోగిస్తారు. వీటినే క్విక్ కోడులని పిలుస్తారు. ఈ కోడ్‌లను ఫోన్లలో డయల్ చేసి తమ నెంబర్లకు యూజర్ల కాల్స్, సందేశాలను మళ్లీస్తారు. “వారు బాధితుడి ఫోన్లు వారికి తెలియకుండా USSD కోడ్‌ను డయల్ చేస్తారు. ఇది #, * వంటి సింబల్స్‌తో మధ్యలో నెంబర్లను కలిగి ఉంటుంది. పౌరులు అటువంటి USSD కోడ్‌లను డయల్ చేసినప్పుడు, వారి ఇన్‌కమింగ్ కాల్‌లు ఫార్వార్డ్ చేయబడతాయి” అని అధికారి తెలిపారు.
Read Also: Jio-Google Gemini Pro: జియో యూజర్లకు అదిరిపోయే శుభవార్త… 18 నెలల పాటు ఉచితమే!
‘‘ఈ విధంగా కాల్స్ వారి నంబర్‌కు డైవర్ట్ చేసిన తరువాత బాధితుడి యూజర్ల కాల్స్, సందేశాలు, ఓటీపీలు స్కామర్లకు వెళ్తాయి. ఇది స్కామర్లకు అవకాశం కల్పిస్తుందని సైబర్ క్రైమ్ పోలీసు అధికారి తెలిపారు. సాధారణంగా, ఏదైనా బ్యాంకింగ్ లావాదేవీలు, UPI, క్రెడిట్/డెబిట్ కార్డ్ లావాదేవీలకు OTP అవసరం. బ్యాంక్ పౌరుడి ఫోన్‌కు OTP పంపినప్పుడు, అది స్కామర్‌కు ఫార్వార్డ్ చేయబడుతుంది. ఆ తర్వాత మోసగాడు ఈ OTPని ఉపయోగిస్తాడు. తద్వారా బాధితుడి బ్యాంక్ ఖాతా లేదా UPI యాప్ నుండి డబ్బును కొట్టేస్తాడు.’’ అని వెల్లడించారు.
బాధితుడు కాల్స్ అందుకోవడం లేదని గమనించినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కాల్స్, సందేశాలు రాకపోయినా, వెళ్లకపోయినా నెట్‌వర్క్ సమస్య అని భావించవచ్చు. కానీ నిజానికి, వారి కాల్స్ స్కామర్ నంబర్‌కు మళ్లించబడ్డాయని గుర్తించాలన్నారు.
సైబర్ మోసాలను నివారించడానికి జాగ్రత్తలు: