 
					ISIS terrorist confess: టెర్రరిస్టులకు అండగా నిలుస్తూ, వారికి ఉగ్రవాదంలో ట్రైనింగ్ ఇస్తూ పాకిస్తాన్ ప్రపంచానికి రెడ్ హ్యండెడ్‌గా పట్టుపడింది. యూఎన్‌లో భారత్ ఇందుకు సంబంధించి ఎన్నో ఆధారాలు సమర్పించినప్పటికీ, పాకిస్తాన్ తాను ఇన్నోసెంట్ అంటూ బుకాయించింది. తాజాగా పాకిస్తాన్‌లోని క్వెట్టాలో శిక్షణ పొంది, టోర్ఖం సరిహద్దు గుండా అక్రమంగా ఆఫ్ఘనిస్తాన్‌లోకి ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదిని ఆఫ్ఘన్ భద్రతా దళాలు పట్టుకున్నాయి. అతని అరెస్టు తర్వాత, తాలిబన్లు ఒక వీడియోను విడుదల చేశారు. ఇందులో పాకిస్తాన్ బుద్దిని బయటపెట్టే ఎన్నో సంచలన విషయాలు ఉన్నాయి.
సయీదుల్లా అనే పేరుతో పట్టుబడిన జిహాదీ, ఆఫ్ఘనిస్తాన్‌లోకి ప్రవేశించినట్లు ఒప్పుకోవడమే కాకుండా, మొత్తం ఆపరేషన్‌ను షాకింగ్ వివరాలతో బయటపెట్టాడని ఆఫ్ఘన్ మీడియా తెలిపింది. అఫ్ఘన్ బలగాలు అదుపులోకి తీసుకున్న ఉగ్రవాది “మొహమ్మద్” అనే మారుపేరుతో మోసపూరిత పత్రాలను ఉపయోగించి తోర్ఖం సరిహద్దు దాటి వెళ్లినట్లు వెల్లడించాడు. పాకిస్తాన్‌లోని క్వెట్టా ప్రాంతంలో తాను క్రమబద్ధమైన బ్రెయిన్‌వాషింగ్, ఉగ్రవాద శిక్షణ పొందుతున్నానని సయీదుల్లా వివరించాడు.
Read Also: US Nuclear Weapons: 33 ఏళ్ల తర్వాత అణ్వాయుధాలను బయటకు తీస్తున్న ట్రంప్ మామ.. ఎందుకంటే?
“నేను నకిలీ ఆధారాలతో ఆఫ్ఘనిస్తాన్‌లోకి ప్రవేశించినప్పుడు, నేను మొహమ్మద్ అనే పేరును ఉపయోగించాను. క్వెట్టాలో, వారు నన్ను పర్వతాలలోకి తీసుకెళ్లారు. అక్కడ వారు నా మనస్సును సమూలంగా మార్చడానికి, నన్ను జిహాద్‌కు సిద్ధం చేయడానికి తీవ్రంగా పనిచేశారు.” అని చెప్పాడు. ఆఫ్ఘనిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుని బీభత్సం సృష్టించడానికి అవసరమైన అన్నింటినీ పాకిస్తాన్ అందించిందని వీడియోలో ఉగ్రవాది అంగీకరించాడు.
పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాదు, వారిని సృష్టిస్తోందని విశ్లేషకులు బహిరంగంగా చెబుతున్నారు. ఉగ్రవాద శక్తులకు ఆశ్రయం కల్పించడం, శిక్షణ ఇవ్వడంలో పాకిస్తాన్ పాత్ర ఉందనే ఆరోపణలపై, ఈ అరెస్టు చర్చను తిరిగి ప్రారంభించిందని అంటున్నారు. “ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదానికి మూలంగా గానీ, కేంద్రంగా లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఉగ్రవాదులకు ఈ ప్రాంతం నుండి నిధులు సమకూరుతాయి. వివిధ పేర్లతో పనిచేస్తాయి” అని అఫ్గన్ సైనిక నిపుణుడు యూసుఫ్ అమిన్ జజాయ్ అన్నారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులకు అండగా ఉన్న పాకిస్తాన్, ఇప్పుడు ఐసీస్ ఉగ్రవాదులను పెంచి పోషించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
BREAKING NEWS 🚨
Al-Mersad released a video on its official channel showing security forces arresting a member of ISIS who had been trained in Pakistan.The arrested individual, Saeedullah, a resident of the Mohmand Agency, admitted in the video that he had been sent to… pic.twitter.com/S75wG9oMfO
— Voice of Khorasan (@VoiceKhorasan1) October 30, 2025