 
					Moto X70 Air vs Vivo V60e vs OnePlus Nord 5 Comparison| మోటోరోలా మోటో X70 ఎయిర్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. ఇది వివో V60e, వన్‌ప్లస్ నార్డ్ 5 ఫోన్‌లకు డైరెక్ట్ కాంపిటీషన్ . ఈ మూడు తమ రేంజ్‌లో పెర్ఫార్మెన్స్, కెమెరా, ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లలో టాప్ పొజిషన్‌లో ఉన్నాయి. స్పెక్స్, ఫీచర్లు కంపేర్ చేసి చూద్దాం. కొత్త ఫోన్ కొనాలనుకునే వారు ఈ మూడు ఫోన్లలో ఏది బెటర్ అని పోల్చి చూసుకోంది.
మోటో X70 ఎయిర్ 12GB ర్యామ్/256GB వేరియంట్ ధర CNY 2,599 (అంటే భారత కరెన్సీలో సుమారు రూ.32,000). 12GB/512GBకి CNY 2,899 (రూ.35,500). వివో V60e 8GB/128GBకి రూ.29,999, 8GB/256GBకి రూ.31,999. వన్‌ప్లస్ నార్డ్ 5 8GB/256GBకి రూ.31,999, 12GB/256GBకి రూ.34,999. అంటే తక్కువ ధరలో మోటో ఎక్కువ ర్యామ్ ఇస్తుంది. అందుకే వ్యాల్యూ పరంగా మోటో బెస్ట్.
మోటో X70 ఎయిర్‌లో 6.7 ఇంచ్ 1.5K pOLED డిస్‌ప్లే (2712×1220 పిక్సెల్స్), 120హెజ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్‌నెస్. కలర్స్ అద్భుతంగా కనిపిస్తాయి. వివో V60eలో 6.77 ఇంచ్ కర్వ్డ్ AMOLED (2392×1080), 1600 నిట్స్. వన్‌ప్లస్ నార్డ్ 5లో 6.83 ఇంచ్ FHD+ AMOLED, 144హెజ్ రిఫ్రెష్, 1800 నిట్స్. స్మూత్ విజువల్స్ కోసం వన్‌ప్లస్ బెస్ట్. బ్రైట్‌నెస్ అయితే మోటో గెలుస్తుంది.
మోటో X70 ఎయిర్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 (4nm) ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ రోజువారీ వర్క్, లైట్ గేమింగ్‌కు సరిపోతుంది. మిగతా రెండు ఫోన్లు విషయానికి వస్తే.. వివో V60eలో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో చిప్ ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 5లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్ ఉంది. మూడింటిని పోల్చి చూస్తే.. నార్డ్ 5 ప్రాసెసర్ ఫాస్టెస్ట్. గేమ్స్, మల్టీటాస్కింగ్ కోసం అయితే వన్‌ప్లస్ టాప్ ఛాయిస్.
మోటో X70 ఎయిర్‌లో 50ఎంపీ మెయిన్ (OISతో), 50ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. వివో V60eలో 200ఎంపీ ప్రైమరీ (OIS), 8ఎంపీ అల్ట్రా-వైడ్ – డీటెయిల్డ్ ఫోటోలకు సూపర్ గా ఉంటుంది. వన్‌ప్లస్ నార్డ్ 5లో 50ఎంపీ మెయిన్ (OIS), 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంది. మూడింట్లోనూ 50ఎంపీ ఫ్రంట్ కెమెరా సెల్ఫీలకు. కెమెరా లవర్స్ అయితే వివో గెలుస్తుంది.
మోటో X70 ఎయిర్‌లో 4800mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ చార్జ్, 15W వైర్‌లెస్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. వివో V60eలో 6500mAh బ్యాటరీ, 90W చార్జింగ్ లో ఎక్కువ బ్యాటరీ లైఫ్, వేగంగా చార్జ్ అవుతుంది. వన్‌ప్లస్ నార్డ్ 5లో 6800mAh, 80W సూపర్‌వూక్. బ్యాటరీ కెపాసిటీలో వన్‌ప్లస్ ఆధిక్యంలో ఉండగా.. అయితే వివో చార్జింగ్ విషయంలో ఫాస్టెస్ట్.
మూడు ఫోన్లలోనూ 5జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై, GPS, USB టైప్-C. వివో V60eలో అదనంగా NFC, IR బ్లాస్టర్. అన్నీ స్మూత్ కనెక్షన్ ఇస్తాయి.
పెర్ఫామెన్స్, గేమింగ్ కోసం స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3తో వన్‌ప్లస్ నార్డ్ 5 గెలుస్తుంది. కెమెరా, బ్యాటరీలో వివో V60e బెటర్. మోటో X70 ఎయిర్ తక్కువ ధరలో ఆండ్రాయిడ్ 16, మంచి ఫీచర్లు ఇస్తుంది. వాల్యూ ఫర్ మనీకి టాప్. మీ ప్రయారిటీ ప్రకారం ఎంచుకోండి. ఈ మిడ్-రేంజర్లు మీ రోజువారీ పనులకు సులభతరం చేస్తాయి.
Also Read: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే