Mahesh Babu – Trisha : తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని జంటలు చూడటానికి చాలా బాగుంటాయి. ఆ జంటలతో సినిమాలు వస్తే మళ్లీ మళ్లీ చూడాలని అభిమానులు అనుకుంటారు. ఆ జంటలలో మహేష్, త్రిష జంట కూడా ఒకటి. ఈ జంట కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అతడు సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే.. ఇక గుణశేఖర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన సైనికుడు సినిమాలోను వీరు మెప్పించారు. ఈ సినిమా థియేటర్లలో సరిగ్గా సక్సెస్ అవ్వక పోయిన, బుల్లితెరపై మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది.. ఆ సినిమాను ఇప్పటికి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు..
ఇక వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమెస్ట్రీ ఆడియన్స్ ను అలరించింది. సినిమా ఎలా ఉన్నా కూడా మహేష్, త్రిష సినిమా అంటే జనాలు థియేటర్లలోకి వస్తున్నారు. అయితే ఆఫ్ స్క్రీన్ లో వీరిద్దరూ ముందే పరిచయం ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. త్రిష, మహేష్ బాబు సినిమాల్లోకి రాకముందు నుంచే వీరిద్దరి మధ్య పరిచయం ఉండేదంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ వీరిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడిందనే విషయాన్ని అందరు గూగుల్ లో వెతికేస్తున్నారు. అసలు విషయం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆ మధ్య ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న త్రిష మాట్లాడుతూ.. మహేష్ బాబు పై ఆసక్తికర విషయాల ను షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ సినిమాల్లోకి రాకముందే మేమిద్దరం ఒకరికి ఒకరు పరిచయం అంటూ యాంకర్ కు వివరించింది. ఆ సందర్బంగా మహేష్ బాబు పై మీ అభిప్రాయం ఏంటని అడిగింది. తనకు ఇష్టమైన హీరోలలో మహేష్ బాబు కూడా ఒకరిని.. ఎవరికి తెలియని విషయం ఏంటంటే కాలేజీలో చదువుకున్న డేస్ లోనే మా ఇద్దరికీ మంచి పరిచయం ఉందంటూ చెప్పుకొచ్చింది. చెన్నైలో చదువుకునే టైంలో ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఉంది. అయితే ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము.. కానీ ఓ ఇద్దరం స్టార్స్ అవుతామని అనుకోలేదని అన్నారు. సినిమాల్లో మహేష్ చాలా కష్ట పడతాడు.
మహేష్ చాలా కష్టపడతాడు.. అందుకే సూపర్ స్టార్ అయ్యాడ ని ప్రశంసలు కురిపించింది. ఇక ప్రస్తుతం త్రిష విశ్వంభర సినిమా లో చిరంజీవి సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు, రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా కు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.. వీరిద్దరూ కలిసి చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మళ్లీ వీరిద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.. మరి ఫ్యాన్స్ కోరిక తీరుతుందేమో చూడాలి.. త్రిష వయస్సు పెరుగుతున్న కూడా తరగని అందంతో వరుస సినిమాల తో బిజీగా ఉంది. ప్రస్తుతం సీనియర్ హీరోలకు చాయిస్ అయ్యింది. తెలుగుతో పాటుగా తమిళ ఇండస్ట్రీ లో వరుస సినిమాలు చేసుకుంటూ వస్తుంది.