 
					Big TV Kissik talks: ఈ మధ్యకాలంలో టాక్ షోలు ఎక్కువగా పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రముఖ ఛానల్ బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా కిస్సిక్ టాక్స్ అంటూ ఒక టాక్ షో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష (Varsha) హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. పలువురు సెలబ్రిటీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ వారం ప్రముఖ యాంకర్ కం బిగ్ బాస్ బ్యూటీ విష్ణు ప్రియ (Vishnu Priya) గెస్ట్ గా విచ్చేసింది.
తాజాగా ఈ కిస్సిక్ టాక్స్ షో లో భాగంగా 34వ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. రేపు అనగా నవంబర్ ఒకటవ తేదీన శనివారం రాత్రి 7 గంటలకు ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో విష్ణుప్రియ ఎన్నో విషయాలను పంచుకుంది. ప్రోమో మొదలవగానే వర్షా మాట్లాడుతూ.. ఎప్పుడూ లేనిది ఈరోజు ఇంత పద్ధతిగా వచ్చావు.. లవ్లో పడ్డావు కదా.. మార్పు వచ్చిందా? అంటూ ప్రశ్నించింది. దానికి విష్ణు ప్రియ సిగ్గుపడిపోయింది. మేము కూడా చాలా ఎదురు చూస్తున్నాం.. విష్ణుప్రియ కాబోయే భర్త ఎవరు? ఎలా ఉంటారు ? అని తెలుసుకోవడానికా అంటూ వర్ష కామెంట్ చేయగా.. శివుడు లాంటి బ్యాలెన్స్డ్ పర్సన్ రావాలి అని విష్ణు ప్రియ చెబితే అంటే పృథ్వీరాజ్ లాగనా అంటూ వర్ష అడిగింది.
మీరు ఎలా అనుకుంటే అలా.. అంటూ కామెంట్ చేసింది విష్ణుప్రియ.. అయితే దీనికి ఏం జరిగింది అంటూ వర్షా ప్రశ్నించగా.. అందరూ అనుకుంటున్నట్లు వస్తే పెళ్లి చేసుకుంటాను.. లేకపోతే సన్యాసం తీసుకుంటాను అంటూ తన అభిప్రాయాన్ని తెలిపి ఆశ్చర్యపరిచింది విష్ణు ప్రియ. అంటే నీకు నచ్చిన అబ్బాయి రాకపోతే సన్యాసం తీసుకుంటావా అంటే.. నా మైండ్ లో ఉండే ఆలోచన అదొక్కటే.. ఒకరినే ఇష్టపడతాను.. వస్తే పెళ్లి చేసుకుంటాను లేకపోతే సన్యాసం తీసుకుని ఇలాగే జీవితాన్ని గడిపేస్తాను అంటూ విష్ణుప్రియ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. నిజానికి బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ గా పాల్గొన్నప్పుడు విష్ణుప్రియ నిజాయితీ ఏంటో అందరూ చూశారు. పృథ్వీరాజ్ శెట్టి ని ఈమె ప్రేమించింది. అతడి కోసం ఎన్నో త్యాగాలు కూడా చేసింది. అటు గేమ్ కూడా లెక్క చేయలేదు. టైటిల్ విజేత అవ్వాల్సిన ఈమె.. ఇతడితో ప్రేమలో పడి హౌస్ నుంచి త్వరగానే బయటకు వచ్చేసింది.. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టార్ మా నిర్వహించే కొన్ని ఈవెంట్లలో కూడా జంటగా పాల్గొని సందడి చేసింది. మరి పృథ్వీ రాజ్ నిజంగానే పెళ్లి చేసుకుంటాడా లేక టైం పాస్ కోసమో లేదా టీవీ షోల కోసమో ఆమెతో అలా ప్రవర్తించారా అన్నది తెలియాలి. ఏది ఏమైనా నచ్చినవాడు తన కోసం రాకపోతే సన్యాసం తీసుకుంటానని హాట్ బాంబు పేల్చింది ఈ ముద్దుగుమ్మ.
also read:Mass Jathara Business : మాస్ జాతర బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఇన్ని కోట్లు రాబాట్టాల్సిందే