 
					The Girl Friend censor Review: నేషనల్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇటీవల ఈమె “థామా” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అయితే త్వరలోనే మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. నటుడు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) దర్శకత్వంలో రష్మిక, దీక్షిత్ శెట్టి (Deekshith Shetty)ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “ది గర్ల్ ఫ్రెండ్”(The Girl Friend). ఈ సినిమా నవంబర్ 7వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్(Censor) కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాని చూసిన అనంతరం ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమా పట్ల తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తో పాటు నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడితో సుదీర్ఘమైన చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
ఇలా సినిమా ఎంతో అద్భుతంగా ఉందని ఈ సినిమాలో రష్మిక నటించిన పాత్ర ప్రతి ఒక్క అమ్మాయికి బాగా కనెక్ట్ అవుతుందని సెన్సార్ సభ్యులు ప్రస్తావించినట్టు సమాచారం. ఇక ఈ సినిమా చూసిన అనంతరం రాహుల్ రవీంద్రన్ మొదటి సినిమా “చిలసౌ”సినిమాకు ఏ విధంగా అయితే జాతీయ అవార్డు (National Award)వచ్చిందో ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి కూడా జాతీయ అవార్డు వస్తుందని ప్రశంసించినట్టు తెలుస్తోంది.. ఇక రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ గా తెరకెక్కించిన చిలసౌ సినిమాలో సుశాంత్, రుహాని శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఆయన ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లేకి జాతీయ అవార్డును అందుకున్నారు.
అంచనాలు పెంచిన ట్రైలర్..
ఈ సినిమా తరహానే ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి కూడా జాతీయ అవార్డు వస్తుందని చెప్పడంతో ఈ సినిమా పట్ల మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాని గీతా ఆర్ట్స్ సమర్పణలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఈ సినిమాపై ఉన్న బజ్ చూస్తుంటే నేషనల్ అవార్డు పక్కా అని స్పష్టం అవుతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్, కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో రష్మిక మరో హిట్ అందుకోబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకొని సినిమాపై అంచనాలను పెంచేసింది.
Also Read: Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్ ఫైర్ అవుతున్న ఆ హీరో ఫ్యాన్స్.. ఏమైందంటే?