 
					Big TV Kissik talks: జబర్దస్త్ (Jabardasth).. కామెడీ షో ద్వారా ప్రేక్షకులను ఎంతగానో అలరించి ఇప్పుడు హోస్ట్ గా అవతారం ఎత్తింది వర్ష(Varsha). ఒకప్పుడు అందరి చేత విమర్శలు ఎదుర్కొన్న ఈమె.. ఇప్పుడు అద్భుతంగా తన వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. అలా తాజాగా ఈమె హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్. తాజాగా 34వ ఎపిసోడ్ కి సంబంధించిన మొదటి ప్రోమోని విడుదల చేయగా.. ఈ ఎపిసోడ్ కి గెస్ట్ గా విష్ణు ప్రియ వచ్చింది. ఇందులో ఎన్నో విషయాలను పంచుకున్న ఈమె ఆఖరికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయాన్ని కూడా బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇంటర్వ్యూలో భాగంగా.. మీరు మీ జీవితంలో ఎదుర్కొన్న అతి పెద్ద చేదు సంఘటన ఏది అని వర్షా ప్రశ్నించగా.. మార్ఫింగ్ వీడియోలు అంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇకపోతే దీనిపై విష్ణుప్రియ మాట్లాడుతూ..”నా సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ అకౌంట్స్ అన్నింటిని హ్యాక్ చేసి అశ్లీల కరమైన ఫోటోలను , వీడియోలను క్రియేట్ చేసి నన్ను అత్యంత దారుణంగా టార్చర్ చేశారు. ముఖ్యంగా మా తాతయ్య, మా అమ్మకు ఫోన్ చేసి ఏంటి విష్ణు ప్రియ ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేస్తోంది అంటూ అడిగారు. ఆ సమయంలో ఏం చేయాలో కూడా తెలియలేదు. బయటకి వెళ్తే కొంతమంది అబ్బాయిలు మేము నీ వీడియో చూసాము అంటూ డైరెక్ట్ గా ముఖం మీదే చెప్పేవాళ్లు. ఆ నరకం అనుభవించలేనిది. అయితే ఆరోజు మా అమ్మ సపోర్టు కనక లేకపోతే ఈరోజు విష్ణుప్రియ ఉండేది కాదు.. నిజానికి ఆరోజే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ మా అమ్మ ఇచ్చిన సపోర్టు, ధైర్యం వల్లే ఈరోజు మళ్లీ నేను ఇక్కడ ఉన్నాను” అంటూ విష్ణుప్రియ తెలిపింది. ఇకపోతే ఈ మార్ఫింగ్ వీడియోలు ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా డీప్ ఫేక్ పేరిట ఆఖరికి చిరంజీవి కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక దీనిపై అధికారులు ఎలాంటి నియంత్రణ కార్యక్రమాలు చేపడతారో చూడాలి.
also read:Big TV Kissik talks: సన్యాసం తీసుకుంటానంటున్న విష్ణు ప్రియ.. ఇదెక్కడ ట్విస్ట్ మావా?
మీ జీవితంలో ఎప్పుడైనా బ్రేకప్ జరిగిందా అని అడగగా నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు. మూడుసార్లు బ్రేకప్ అయ్యింది అంటూ తన బ్రేకప్ విషయాలను కూడా చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ. బ్రేకప్ వల్ల ఎంత ఇబ్బంది ఎదుర్కొంది అనే విషయంపై కూడా మాట్లాడుతూ.. అందరిని ఆశ్చర్యపరిచింది. ఏది ఏమైనా ఎప్పుడూ తన అల్లరితో అందరి దృష్టిని ఆకట్టుకునే విష్ణుప్రియ జీవితంలో కూడా ఇంత విషాదం ఉందా అంటూ అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే విష్ణుప్రియ చిన్నవయసులోనే తల్లిదండ్రులు విడిపోయిన విషయం తెలిసిందే. ఇక తల్లి మరణించిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన తండ్రిని కలుసుకుంది విష్ణు ప్రియ.